చంద్రబాబు ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

ABN , First Publish Date - 2021-10-22T06:03:01+05:30 IST

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గురువారం రాత్రి తలుపులలోని శ్రీరామస్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చంద్రబాబు ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలు

 తలుపుల , అక్టోబరు  21: మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ గురువారం రాత్రి తలుపులలోని శ్రీరామస్వామి దేవాలయంలో టీడీపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి నిరసనగా చంద్రబాబు 36 గంటలు నిరసన దీక్ష చేస్తుం డంతో ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఎద్దుల రాముడు, రాజారెడ్డి, రఘునాథరెడ్డి, కొట్టె బాలక్రిష్ణ, అజం తుల్లా, సిద్దిక్‌ వలి, శ్రీనివాసులు, మహేష్‌, లోకేశ్వర, వెంకటరమణ, విశ్వనాథ్‌, శంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  



Updated Date - 2021-10-22T06:03:01+05:30 IST