Advertisement
Advertisement
Abn logo
Advertisement

అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు

అక్కిరెడ్డిపాలెం, డిసెంబరు 1: కార్తీక మాసం ఆఖరి బుధవారం సందర్భంగా షీలానగర్‌ అయ్యప్పస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ప్రధానార్చకులు కృష్ణన్‌ నంబూద్రి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామికి పంచామృతాలతో అభిషేకాలు చేసి పూలు, నగలతో అలంకరించారు. అనంతరం అయ్యప్పస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్బంగా మణికంఠ జ్యోతి భక్తసేవా సంఘం ఆద్వర్యంలో బి సురేష్‌రెడ్డి ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన నిత్యాన్న సమారాధనను మునిసిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ కె.రమేశ్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అవుట్‌ సోర్సింగ్‌ ఎంప్లాయిమెంట్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ బోగాది సన్యాసిరావు, సంఘ సభ్యులు చరపాక నాగార్జున, నంబారు రాజు, ఎస్‌.విశ్వేశ్వరరావు,  బి.అప్పలస్వామి, టి.నూకునాయుడు, ఎన్‌.రమణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement