Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్ దేశాలలో ఘనంగా భాగవత పద్యాల పోటీలు

న్యూఢిల్లీ: గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, కువైత్, యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, ఒమన్ దేశాల్లో రవి కాంచిన పోతన భాగవత పద్యాల పోటీలు ఈ నెల 23,24 తేదీల్లో ఘనంగా జరిగాయి. గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య సంయుక్త నిర్వహణలో ఐబాం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో 140 మందికిపైగా పిల్లలు పాల్గొన్నట్టు కార్యక్రమ నిర్వాహకుడు కుదరవల్లి సుధాకర రావు ఓ ప్రకటనలో తెలిపారు. న్యాయ నిర్ణేతలుగా భారత్‌లో నివసిస్తున్న ప్రముఖ తెలుగు పండితులు వ్యవహరించినట్టు ఆయన వెల్లడించారు.


పూర్తిగా వర్చువల్ పద్ధతిలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైత్, తెలుగు కళా సమితి కువైత్, తెలుగు కళా సమితి బహ్రెయిన్, తెలుగు కళా సమితి ఒమన్, ఆంధ్ర కళా వేదిక ఖతర్, తెలుగు కళా సమితి ఖతర్, తెలుగు తరంగిణి యూఏఈ, సౌదీ తెలుగు అసోసియేషన్, యూఏఈ తెలుగు అసోసియెషన్ కలిసి పని చేసినట్టు తెలిపారు. ప్రముఖ సినీ గేయ రచయిత భువనచంద్ర, వంశీ సంస్థల అధినేత వంశీ రామరాజు, ఐబాం గ్లోబల్ కోఆర్డినేటర్ రమేష్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీల్లో గెలుపొందిన విజేతల పేర్లను ప్రకటించారు. కుదరవల్లి సుధాకర రావు మాట్లాడుతూ.. చక్కని కార్యక్రమం నిర్వహణకు అవకాశం కల్పించిన ఐబాం సంస్థ అధ్యక్షులు మల్లిక్ పుచ్చా‌కు ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు, గల్ఫ్ దేశాలలోని తెలుగు సంఘాల అధ్యక్షులకు, వారి కార్యవర్గ సభ్యులతోపాటు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement