సింధుపై ప్రత్యేక పోస్టల్‌ కవర్‌

ABN , First Publish Date - 2021-08-30T08:24:23+05:30 IST

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తపాలా శాఖ పీవీ సింధుపై ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది.

సింధుపై ప్రత్యేక పోస్టల్‌ కవర్‌

హైదరాబాద్‌  (ఆంధ్రజ్యోతి):  జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం తపాలా శాఖ పీవీ సింధుపై  ప్రత్యేక కవర్‌ను విడుదల చేసింది. కవర్‌ను తెలంగాణ పోస్టల్‌ సర్కిల్‌ చీఫ్‌ పోస్ట్‌ మాస్టర్‌ జనరల్‌ ఎస్‌. రాజేంద్రకుమార్‌ ఆవిష్కరించారు. భవిష్యత్‌లో సింధు స్వర్ణం  తీసుకురాగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పోస్టల్‌ సర్వీసుల డైరెక్టర్‌ దేవరాజ్‌, పోస్టల్‌ విభాగాల అధికారులు సాయి పల్లవి, రిప్పన్‌ డుల్లెట్‌ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోస్టల్‌ కవర్‌లు ఖైరతాబాద్‌ ప్రధాన పోస్టాఫీసులో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-08-30T08:24:23+05:30 IST