అగ్ని ప్రమాదాల రక్షణకు ప్రత్యేక పాలసీలు

ABN , First Publish Date - 2022-05-13T06:49:26+05:30 IST

బీమా కంపెనీలు.. చిన్న తరహా గృహాలు, చిన్న వ్యాపారులకు అగ్ని ప్రమాదాలు, సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యామ్నాయ పాలసీలు ప్రారంభించేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది.

అగ్ని ప్రమాదాల రక్షణకు ప్రత్యేక పాలసీలు

న్యూఢిల్లీ : బీమా కంపెనీలు.. చిన్న తరహా గృహాలు, చిన్న వ్యాపారులకు అగ్ని ప్రమాదాలు, సంబంధిత ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యామ్నాయ పాలసీలు ప్రారంభించేందుకు ఐఆర్‌డీఏఐ అనుమతి ఇచ్చింది. కస్టమర్లకు విస్తృత ఎంపికలు అందించడం, బీమా మరింతగా విస్తరింపచేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది. అగ్ని ప్రమాదాల వ్యాపారంలో కొత్త కవరేజీలకు డిమాండ్‌ పెరుగుతుండడమే ఈ ప్రత్యామ్నాయాలకు అనుమతించడానికి ప్రధాన కారణమని ఐఆర్‌డీఏఐ తెలిపింది. ఈ కొత్త ప్రత్యామ్నాయ పాలసీలు గతంలోని భారత్‌ గృహ రక్ష, భారత్‌ సూక్ష్మ ఉద్యమ్‌ సురక్ష, భారత్‌ ఉద్యమ్‌ సురక్ష వంటి ప్రామాణిక ఉత్పత్తులకు కొత్త పాలసీలు లేదా యాడ్‌ అన్‌గా అందించవచ్చని పేర్కొంది.

Read more