విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై ప్రత్యేక ఆదేశాలు

ABN , First Publish Date - 2021-12-30T23:25:07+05:30 IST

విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులకు ప్రత్యేక

విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై  ప్రత్యేక ఆదేశాలు

విశాఖ: విశాఖలో న్యూ ఇయర్‌ వేడుకలపై పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు ఏబీఎన్‌తో లా అండ్ ఆర్డర్ డీసీపీ గౌతమీ సాలి తెలిపారు. డిసెంబర్ 31న బీచ్ రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి నిషేధం ఉంటుందన్నారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, బీ‌ఆర్‌టీ‌ఎస్ సెంటర్ లైన్ రోడ్ కూడా మూసే అవకాశం ఉందన్నారు. జిగ్ జాగ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓపెన్ డ్రింకింగ్ పై ప్రత్యేకంగా నిఘా పెట్టామని పేర్కొన్నారు. నగరంలో కేక్ కటింగ్‌లు, డీజేలపై నిషేధం విధించామన్నారు. హోటల్స్‌లో ఈవెంట్‌ల కోసం తమకు ఎటువంటి అభ్యర్థనలు రాలేదన్నారు. తాను ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని డీసీపీ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలనేది తమ ఉద్దేశమని ఏబీఎన్‌తో డీసీపీ గౌతమీ అన్నారు. 

Updated Date - 2021-12-30T23:25:07+05:30 IST