గృహ నిర్మాణాల పరిశీలన

ABN , First Publish Date - 2022-05-27T05:26:55+05:30 IST

కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి దుర్గేష్‌ ఆదేశించారు.

గృహ నిర్మాణాల పరిశీలన
వీరవాసరంలో గృహనిర్మాణాలు పరిశీలిస్తున్న ప్రత్యేకాధికారి

వీరవాసరం, మే 26: కాలనీలో లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల్లో ఇంటి నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలని మండల ప్రత్యేక అధికారి దుర్గేష్‌ ఆదేశించారు. మండలంలోని వీరవాసరం పెద దళితపేట, తలతాడతిప్ప స్థలాల్లో గృహ నిర్మాణాలను గురువారం ఆయన పరిశీలించారు. లబ్దిదారులతో మాట్లాడి వారి సమస్యలను  తెలుసుకున్నారు. గృహ నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఎంపీడీవో పి.శామ్యూల్‌, తహసీల్దార్‌ ఎం.సుందరరాజు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-05-27T05:26:55+05:30 IST