స్పెషల్‌ పార్టీ సిబ్బంది సంక్షేమానికి చర్యలు

ABN , First Publish Date - 2021-12-07T05:39:24+05:30 IST

ప్రత్యేక విధుల్లో పాల్గొనే స్పెషల్‌ పార్టీ సిబ్బంది సేవలు అభినందనీయమని వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న పెన్నార్‌ పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బందికి జంగిల్‌ షూస్‌ అందజేశారు.

స్పెషల్‌ పార్టీ సిబ్బంది సంక్షేమానికి చర్యలు
జంగిల్‌ షూస్‌ అందజేస్తున్న ఎస్పీ

ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ 

కడప(క్రైం), డిసెంబరు 6: ప్రత్యేక విధుల్లో పాల్గొనే స్పెషల్‌ పార్టీ సిబ్బంది సేవలు అభినందనీయమని వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎస్పీ కేకేఎన్‌.అన్బురాజన్‌ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఉన్న పెన్నార్‌ పోలీసు కాన్ఫరెన్స్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్‌ఎ్‌సఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బందికి జంగిల్‌ షూస్‌ అందజేశారు. విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా విధులు నిర్వర్తించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో జిల్లా స్పెషల్‌ పార్టీకి ప్రత్యేక స్థానం ఉందన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తన దృష్టికి  తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో 110 మంది స్పెషల్‌ పార్టీ సిబ్బందికి లిబర్టీ కంపెనీకి చెందిన జంగిల్‌ షూస్‌ అందజేశారు. అదనపు ఎస్పీ (ఆపరేషన్స్‌) దేవప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ మహే్‌షకుమార్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, ఆర్‌ఐ వీరేష్‌, ఆర్‌ఎ్‌సఐలు, స్పెషల్‌ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-07T05:39:24+05:30 IST