సైబర్‌ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు

ABN , First Publish Date - 2022-01-22T05:00:02+05:30 IST

రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణ కోసం అవసరమైన చ ర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మలిక గర్గ్‌ పేర్కొన్నారు. సైబర్‌ నేర నియంత్రణ, దర్యా ప్తునకు సంబంధించిఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రీసె ర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరె న్సిక్‌ సహకారంతో రెండు రోజుల శిక్షణ తరగతు లను శుక్రవారం ఒంగోలులో నిర్వహించారు.

సైబర్‌ నేరాల నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు
మాట్లాడుతున్న ఎస్పీ మలికగర్గ్‌

ఎస్పీ మలిక గర్గ్‌ 

 ఒంగోలులో రెండు రోజుల శిక్షణ ప్రారంభం 


ఒంగోలు(కార్పొరేషన్‌), జనవరి 21 : రాష్ట్రంలో సైబర్‌ నేరాల నియంత్రణ కోసం అవసరమైన చ ర్యలు తీసుకుంటున్నట్లు  ఎస్పీ మలిక గర్గ్‌ పేర్కొన్నారు. సైబర్‌ నేర నియంత్రణ, దర్యా ప్తునకు సంబంధించిఢిల్లీలోని సెంటర్‌ ఫర్‌ రీసె ర్చ్‌ ఆన్‌ సైబర్‌ ఇంటిలిజెన్స్‌ అండ్‌ డిజిటల్‌ ఫోరె న్సిక్‌ సహకారంతో రెండు రోజుల శిక్షణ తరగతు లను శుక్రవారం ఒంగోలులో నిర్వహించారు. మంగళగిరి నుంచి అదనపు డీజీ ఎన్‌.సంజయ్‌, డీఐజీ(టెక్నికల్‌) సర్వీసెస్‌ జి.పాలరాజు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లాలో కమిషనరేట్‌ పరిధిలో పనిచేసే ద ర్యాప్తు అధికారులు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తు న్నట్లు చెప్పారు. ఒంగోలు పీటీసీ నుంచి వివిధ జిల్లాలకు చెందిన 116 మందిని సైబర్‌ క్రైం దర్యా ప్తులో నిపుణులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేప ట్టినట్లు తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక ల్యా బ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు.  పీటీసీ ప్రిన్సిపాల్‌ దామోదర్‌ మాట్లాడుతూ సైబర్‌ క్రైం పరిశోధన కోసం ఎంతో నైపుణ్యం కావాలని, అందుకు ఈ శిక్షణ ఉపయో గపడుతుందని చెప్పారు. సమావేశంలో పాటిబం డ్ల ప్రసాద్‌, టెక్నికల్‌ మేనేజరు మనీష్‌యాదవ్‌,పీటీసీ వైస్‌ప్రిన్సిపాల్‌ చిరంజీవి, డీఎస్పీలు సు ధాకర్‌, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-22T05:00:02+05:30 IST