మత్స్యకారుల తరహాలోనే ఎస్టీలకు ప్రత్యేక జీవన భృతి

ABN , First Publish Date - 2022-01-25T05:41:27+05:30 IST

తీరప్రాంత మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఎలాంటి జీవన భృతిని కల్పిస్తుందో అదే తరహాలో మండలంలోని ఎస్టీ యానాదులకు జీవన భృతి కల్పించేలా కృషి చేస్తానని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు.

మత్స్యకారుల తరహాలోనే ఎస్టీలకు ప్రత్యేక జీవన భృతి
మాట్లాడుతూ కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి

ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి హామీ 

ఉలవపాడు, జనవరి 24 : తీరప్రాంత మత్స్యకారులకు చేపల వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఎలాంటి జీవన భృతిని కల్పిస్తుందో అదే తరహాలో మండలంలోని ఎస్టీ యానాదులకు జీవన భృతి కల్పించేలా కృషి చేస్తానని కందుకూరు శాసనసభ్యుడు మానుగుంట మహీధర్‌రెడ్డి పేర్కొన్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ వాయుల మస్తానమ్మ అధ్యక్షతన సోమవారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా మే, జూన్‌ నెలలో మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకుండా నిషేధిస్తారన్నారు. ఆ సమయానికిగాను ప్రభుత్వం అర్హులకు రూ.10000 భృతిని అందిస్తుందన్నారు. అదేవిధంగా మండలంలో ఎస్టీలు ఎక్కువ అని చాలా వరకు గ్రామాల పరిధిలోని చెరువులు, కుంటలు, కాలువల మీద ఆధారపడి చేపలవేట సాగిస్తుంటారన్నారు. ఎండాకాలానికి నీరు అడుగంటి పోవడం వలన చేపల వేటమీద ఆధారపడిన కుటుంబాలకు కూడా ప్రభుత్వం కొంత జీవన భృతి కల్పిస్తే ఆధరంగా ఉంటుందన్నారు. దీనిలో భాగంగా మండల సమావేశంలో సభ్యుల చేత ప్రభుత్వానికి నివేదించెందుకు తీర్మానం చేయించారు. అంతేకాకుండా నెల్లూరు ఐటీడీఏ అధికారులతో మాట్లాడి నియోజకవర్గానికి ఏకలవ్య కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించి ఉలవపాడు మంలంలోని కరేడు గ్రామంలో రూ. 14. కోట్లతో 20 ఎకరాలల్లో స్ధాపించబోతున్నట్లు ఎమ్మేల్యే చెప్పారు. ఎస్టీలకు సెంట్రల్‌ సిలబ్‌సతో ఇంటర్‌ వరకు కార్పొరేట్‌ విద్య అందించడమే ప్రత్యేకతన్నారు. ఎమ్మేల్సీ తూమాటి మాధవరావు మాట్లాడుతూ..జిల్లా నుంచి ఎమ్మేల్సీగా ప్రాధన్యత కల్సించినందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి, సహకరించిన కందుకూరు ఎమ్మేల్యే మహీధర్‌రెడ్డికి,   ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో మండలంలో ఇప్పటి వరకు చేపట్టిన, చేపట్టాల్సిన పనుల గురించి అన్ని శాఖల అధికారులు తమ నివేదికలు సభ్యులకు తెలిపారు. ఆయా గ్రామాల్లోని సమస్యలను స్థానిక ఎంపీటీసీలు అధికారుల దృష్టికి తీసుకురాగా పరిష్కరిస్తామని సభ్యులకు సమాధానాలు చెప్పారు. సమావేశంలో జెడ్పీటీసీ చేవూరి అరుణ, ఎంపీడీవో ఎల్‌.చెంచమ్మ, విద్యుత్‌శాఖ ఏఈ తూమాటి నరంసింహారావు, ఏపీఎం చిన్నయ్య, ఏపీవో వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూఎస్‌ నాయబ్‌రసూల్‌, ఇతర శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:41:27+05:30 IST