న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి

ABN , First Publish Date - 2022-06-26T04:36:45+05:30 IST

న్యాయవాదులపై జరుగుతు న్న దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నమయ్య జిల్లా న్యాయవా దుల సంక్షేమ సమితి డిమాండ్‌ చేసింది.

న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి
అన్నమయ్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి నేతలు

అన్నమయ్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి డిమాండ్‌

రాయచోటి(కలెక్టరేట్‌), జూన్‌25: న్యాయవాదులపై జరుగుతు న్న దాడుల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు  ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నమయ్య జిల్లా న్యాయవా దుల సంక్షేమ సమితి డిమాండ్‌ చేసింది. శనివారం అన్నమ య్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన న్యాయవాదుల సమావేశంలో అధ్యక్షుడు రాజ్‌కుమార్‌రాజు, ప్రధాన కార్యదర్శి ఆనంద్‌కుమాల్‌ మాట్లా డుతూ ఇటీవల న్యాయవాదులపై ప్రతి చిన్న విషయానికీ దాడులు జరుగుతున్నాయని, దాడుల నుంచి న్యాయవాదు లకు సరైన భద్రత ఉండాల్సిన అవసరం ఉందని, ఇందు కోసం ప్రత్యేక   చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావాల్సిన అవ సరం ఉందన్నారు.

గతంలో బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం కావాలని ప్రతి పాదనలు చేసినా అది ఆచరణలోకి రాలేదన్నారు. సమితి లీగల్‌ అడ్వైజర్‌, సీనియర్‌ న్యాయవాది అజ్మతుల్లా మాట్లాడు తూ న్యాయవాదుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక చట్టాన్ని చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. అఖిల భార త న్యాయవాదుల సమాఖ్య అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్‌, ప్రధాన కార్యదర్శి ఖాదర్‌బాషా మాట్లాడారు. 

న్యాయవాదుల సంక్షేమ సమితి ఏర్పాటు

అన్నమయ్య జిల్లా న్యాయవాదుల సంక్షేమ సమితి నూతన కమిటీని సీనియర్‌ న్యాయవాది అజ్మతుల్లా అధ్యక్షతన ఎన్ను కున్నారు. గౌరవాధ్యక్షుడిగా ధనుంజయకుమార్‌, అధ్యక్షుడిగా రాజ్‌కుమార్‌రాజు, ఉపాధ్యక్షులుగా చిన్నయ్య, హుమయూ న్‌బాషా, ప్రధాన కార్యదర్శిగా ఆనంద్‌కుమార్‌, సహాయ కార్య దర్శులుగా ఖాదర్‌బాషా, నాగరాజ, ట్రెజరర్‌గా ఈశ్వర్‌, కార్య వర్గ సభ్యులుగా ఖుష్ణుమా వరలక్ష్మి, ఖైరున్‌, నాగేశ్వర్‌, టీవీ రమణ, కృష్ణయ్య, కల్యాణ్‌, ఖిజర్‌బాషా, నాగేశ్వరరావు, బాలచంద్ర తదితరులను ఎన్నుకున్నారు.

Updated Date - 2022-06-26T04:36:45+05:30 IST