ప్రతీ కుక్కకూ ఓ రోజు... ముప్పూటలా భోజనం... మంచి వసతి!

ABN , First Publish Date - 2021-01-20T13:20:34+05:30 IST

శునకాలంటే ఇష్టపడే చాలామందిని మనం చూసేవుంటాం. ఇటువంటివారు...

ప్రతీ కుక్కకూ ఓ రోజు... ముప్పూటలా భోజనం... మంచి వసతి!

ఘాజియాబాద్‌: శునకాలంటే ఇష్టపడే చాలామందిని మనం చూసేవుంటాం. ఇటువంటివారు తమ పెంపుడు శునకాలను చక్కగా సంరక్షిస్తుంటారు. కానీ వీధి కుక్కలను గురించి పట్టించుని, వాటిని సంరక్షించే ఉదంతాలు ఎక్కాడావినివుండం. అయితే ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో గల రామ్‌ప్రస్థ్ గ్రీన్స్ క్యాంపస్‌లో ఇటువంటి దృశ్యం కనిపిస్తుంది. రోడ్లపై తిరిగే కుక్కలకు ఇక్కడ ప్రత్యేకమైన ఆవాసాన్ని రూపొందించారు. 


ఘాజియాబాద్‌లోని ఈ సొసైటీకి 100 ఎకరాల స్థలం ఉంది. రోడ్డుపై తిరిగే శునకాలకు ఈ స్థలంలో 25 డాగ్ హౌస్‌లను ఏర్పాటు చేశారు. ఇక్కడ వాటికి మూడు పూటలా ఆహారాన్ని అందిస్తారు. ఘాజియాబాద్‌‌లో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. దీనిపై ఎన్ని ఫిర్యాదులు అందినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో రామ్‌ప్రస్థ్ గ్రూప్ ఈ దిశగా ముందడుగు వేసింది. రామ్‌ప్రస్థ్ గ్రూప్ వీధి కుక్కల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. వీధికుక్కల సంరక్షణ బాధ్యతను చేపట్టిన ఈ సంస్థ మొత్తం 70 శునకాల ఆలనాపాలనా చూస్తోంది. సంస్థ తీర్చిదిద్దిన డాగ్ హౌస్‌లలో కుక్కలకు కావాల్సిన ఆహారంతో పాటు లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసింది. సొసైటీకి చెందిన ఒక మహిళ ఈ కుక్కలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారు. సొసైటీలోని సభ్యులు కూడా శునకాల సంరక్షణకు తమవంతు సాయం చేస్తుంటారు. ఈ సందర్భంగా రామప్రస్థ్ గ్రూప్ జనరల్ మేనేజర్ భాస్కర్ గాంధీ మాట్లాడుతూ కొంతకాలం క్రితం వీధికుక్కల సంరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని గుర్తుచేశారు. ఈ నేపధ్యంలోనే తాము వీధి శునకాల సంరక్షణ దిశగా నడుంబిగించామని అన్నారు.

Updated Date - 2021-01-20T13:20:34+05:30 IST