Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రొస్టేట్‌కు ప్రత్యేక ఆహారం..

ఆంధ్రజ్యోతి(12-03-2021)

ప్రశ్న: ప్రొస్టేట్‌ ఆరోగ్యానికి ప్రత్యేక ఆహారం ఉందా?


- నాగేశ్వరరావు, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: ప్రొస్టేట్‌ ఎన్‌లార్జ్‌మెంట్‌ సమస్య (బినైన్‌ ప్రోస్టాటిక్‌ ప్లేసియా-ఆ్కఏ) వయసుతో పాటు వచ్చే అవకాశం ఉంది. యాభై సంవత్సరాలు దాటిన పురుషుల్లో దాదాపు యాభై శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఆహారంలో, జీవనశైలిలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేసుకోవడం ద్వారా ఆ్కఏ వల్ల వచ్చే సమస్యల్ని అధిగమించవచ్చు. తరచుగా మూత్రానికి వెళ్ళవలసి రావడం, మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవకపోవడం, మూత్రం ఆపుకోలేక పోవడం తదితరాలు ఈ సమస్య వల్ల ఎదురవుతాయి. బయటికి వెళ్లే ముందు లేదా నిద్రకు ఉపక్రమించే ఒకటి రెండు గంటల ముందు నుండి ద్రవపదార్థాలను తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీ, ఆల్కహాలుకు దూరంగా ఉండడం మంచిది. కొవ్వు అధికంగా ఉండే వేయించిన పదార్థాలు, చిరుతిళ్ళు, ఫాస్ట్‌ పుడ్స్‌ను తగ్గించాలి. ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలు, అన్ని రకాల పండ్లూ తరచూ తీసు కోవాలి. ముఖ్యంగా నిమ్మజాతికి చెందిన బత్తాయి, కమలా పండ్లను రోజూ తీసుకోవడం ఉపయోగకరం. బరువు నియంత్రణలో ఉంచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం కూడా అవసరం. 


డా. లహరి సూరపనేని 

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...