చెత్త నుంచి సంపద కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

ABN , First Publish Date - 2020-07-09T11:05:34+05:30 IST

చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాలో వారం రోజుల పాటు

చెత్త నుంచి సంపద కేంద్రాలపై ప్రత్యేక దృష్టి

 విజయనగరం (ఆంధ్రజ్యోతి), జూలై 8:  చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో  జిల్లాలో వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇన్‌చార్జి డీపీవో సునీల్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. బుధవారం తన చాంబర్లో  మాట్లా డుతూ.. ఈ నెల 8 నుంచి 10 వరకూ చెత్త నుంచి సంపద కేంద్రాల పనితీరు మెరుగు పడాలన్నారు. జిల్లాలో 654 కేంద్రాలు ఉన్నా.. అవి అంతంతమాత్రంగానే పనిచేస్తున్నాయని తెలిపారు. వాటి నుంచి సంపద సృష్టించేలా ప్రణా ళికలు  రూపొందించామన్నారు. 


కేంద్రాల చుట్టూ   మొక్కలను పెంచడం తో పాటు, పరిసరాలను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దనున్నామని స్పష్టం చేశారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ పాడి రైతులతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించి, వర్మీ కంపోస్టు ఎరువుల తయారీపై అవగాహన కల్పిస్తామని చెప్పారు.  14 నుంచి 16 వరకూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల్లో వానపాములు వదిలే కార్యక్రమంతో పాటు, గ్రీన్‌ అంబాసిడర్లకు విజిల్స్‌ అందజేస్తామన్నారు.  ఇంటింటి నుంచి చెత్త సేకరించడం, వాటిని  కేంద్రాలకు తరలించే కార్యక్ర మంపై వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2020-07-09T11:05:34+05:30 IST