జగనన్న లేఅవుట్లలో బోర్‌వెల్‌, పంపుసెట్టు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-05-27T05:14:18+05:30 IST

జగనన్న లేఅవుట్లలో యుద్ధప్రాతిపదికన బోర్‌వెల్‌, పంపుసెట్టు తప్పకుండా ఏర్పాటు చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు.

జగనన్న లేఅవుట్లలో బోర్‌వెల్‌, పంపుసెట్టు తప్పనిసరి
అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా

నాడు- నేడు రెండో విడత పనుల్లో వేగం పెంచాలి 

అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా


రాయచోటి(కలెక్టరేట్‌), మే 26: జగనన్న లేఅవుట్లలో యుద్ధప్రాతిపదికన బోర్‌వెల్‌, పంపుసెట్టు తప్పకుండా ఏర్పాటు చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ పీఎస్‌ గిరీషా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జగనన్న లేఅవుట్లు, రెండోదశ మనబడి నాడు- నేడు పనులు, కమ్యూనిటీ శానిటేషన్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణం, ట్యాక్స్‌ కలెక్షన్లపై ఆర్‌డబ్ల్యుఎస్‌, హౌసింగ్‌, పంచాయతీరాజ్‌ తదితర ఇంజనీరింగ్‌ అదికారులు, ఎంఈవోలతో కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పనులు అమలుపై దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొత్తగా శాంక్షన్‌ అయిన జగనన్న లేఅవుట్లలో బోర్‌వెల్‌, పంపుసెట్ల కోసం వెంటనే మంజూరు అనుమతులు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ మండల ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. లేఅవుట్లలో నీళ్లు లేకపోతే ఇంటి నిర్మాణాలు చేపట్టలేరని జగనన్న లేఅవుట్లలో 30 కన్నా ఎక్కువ ఇళ్లు ఉన్న ప్రతి లేఅవుట్లలోతప్పకుండా బోరు, పంపుసెట్‌ ఏర్పాటు చేయాలన్నారు. వచ్చే వారం లోపు అన్ని లేఅవుట్లలో వందశాతం బోర్‌వెల్‌ పంపుసెట్లు ఏర్పాటు చేయాలన్నారు. ఇక జిల్లాలో మనబడి నాడు- నేడు రెండో విడత పనులు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఇసుక, సిమెంట్‌, స్టీల్‌కు సంబంధించి అవసరం మేరకు వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న అడ్మినిస్ర్టేషన్‌ శాంక్షన్‌, ఎస్టిమేషన్‌ జనరేషన్‌, టెక్నికల్‌ శాంక్షన్‌లలో అప్రూవల్‌ కొరకు వెంటనే సమర్పించాలన్నారు.  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మనబడి నాడు- నేడు పనుల్లో ఎటువంటి సమస్యలు లేకుండా పారదర్శకంగా, నాణ్యతతో నిర్ధేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో రైతు భరోసా కేంద్రాలు, డాక్టర్‌ వైఎ్‌సఆర్‌ హెల్త్‌ క్లీనిక్‌ భవన నిర్మాణాలు, నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌ ఏఈలకు సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ సాంబశివయ్య, డీపీవో నాగరాజు, పబ్లిక్‌ హెల్త్‌ ఏఈ వెంకటకృష్ణారెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతీరాజ్‌ అధికారులు, ఎంఈవోలు తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2022-05-27T05:14:18+05:30 IST