స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-05-21T11:07:00+05:30 IST

జిల్లాలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం నియమించిన స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ విభాగం

స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ దాడులు ప్రారంభం

14 టన్నుల ఇసుక, 13,120 లీటర్ల సారా ఊట ధ్వంసం

51 మంది అరెస్ట్‌, 15 వాహనాలు సీజ్‌


అనంతపురం క్రైం, మే 20 : జిల్లాలో ఇసుక, మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం నియమించిన స్పెషల్‌ ఎన్‌ ఫోర్స్‌మెంట్‌ విభాగం జిల్లాలో కొరడా ఝుళిపించింది.  24 గంటలలో 14 టన్నుల ఇసుక, 13,120 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేసి, 51 మందిని అరెస్ట్‌ చేసి 15 వాహ నాలను సీజ్‌ చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు స్పెష ల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి రామ్మోహన్‌రావు నేతృత్వం లో మంగళవారం అర్ధరాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు జి ల్లా వ్యాప్తంగా ఆయా పోలీసులు బృందాలుగా ఏర్పడి దాడులు ముమ్మరం చేశా రు. దీంతో నాటుసారా తయారీ, మద్యం అక్రమ రవాణాపై ఎక్కడికక్కడ ని ఘా ఉంచి దాడులు విస్తృతం చేశారు. నాటు సారా తయారీ, విక్రయాలు చేస్తున్న 51మంది నిందితులను అరెస్ట్‌ చేసి 15 వాహనాలను సీజ్‌ చేశారు.  1067 మద్యం బాటిళ్లు, 8990 టెట్రా ప్యాకెట్‌లు, 86 లీటర్ల మద్యం, 121 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.  

Updated Date - 2020-05-21T11:07:00+05:30 IST