పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌

ABN , First Publish Date - 2020-06-03T10:36:58+05:30 IST

నగరంలోని పలుచోట్ల పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమాన్ని రెండో రోజు మంగళవారం కూడా నిర్వహించారు. చెత్తను తొలగించారు. బడంగ్‌పేట్‌

పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌

సరూర్‌నగర్‌/పహాడిషరీ్‌ఫ/వనస్థలిపురం/చంపాపేట/నల్లకుంట/రాంనగర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలుచోట్ల పారిశుధ్యంపై ప్రత్యేక డ్రైవ్‌ కార్యక్రమాన్ని రెండో రోజు మంగళవారం కూడా నిర్వహించారు. చెత్తను తొలగించారు. బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌లోని గుర్రంగూడ 6,7వార్డుల పరిధిలో చెత్త కుప్పలను తొలగించారు. మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డి, డిప్యూటీ మేయర్‌ శేఖర్‌, కమిషనర్‌ సత్యబాబు, కార్పొరేటర్లు దడిగ శంకర్‌, గడ్డం లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. 


జల్‌పల్లి మున్సిపాల్టీ పరిధిలో జరిగిన కార్యక్రమంలో కమిషనర్‌ అహ్మద్‌ షఫియుల్లా, మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్లా బిన్‌ అహ్మద్‌ సాది, కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

జడ్‌పీ రోడ్డు, టీకేఆర్‌ రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెత్తాచెదారం, ప్లాస్టిక్‌ కవర్లు, మట్టిని తొలగించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్‌ రమావత్‌ పద్మానాయక్‌ మాట్లాడుతూ సీజనల్‌ వ్యాఽధులు ప్రభలకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.  

చంపాపేటలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్‌ సామ రమణారెడ్డి, నోడల్‌ అధికారి శ్రీధర్‌, ఏవో రవికిరణ్‌, శానిటేషన్‌ ఇన్‌స్పెక్టర్‌ గణేశ్‌ పాల్గొన్నారు. 

నల్లకుంట డివిజన్‌లోని శంకరమఠం మార్కెట్‌, మొయిన్‌ రోడ్‌లో చెత్తాచెదారం తొలగించారు. కార్పొరేటర్‌ గరిగంటి శ్రీదేవీరమేష్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఇంటితోపాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్‌ ఎస్‌ఎ్‌ఫఏలు యాదగిరి, బాబురావు, వాసుదేవరెడ్డి, సురేష్‌, శ్రీనివాస్‌, ఎల్లేష్‌ పాల్గొన్నారు.  

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు శానిటేషన్‌ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారని బీజేపీ రాష్ట్ర నాయకుడు సి.ప్రకా్‌షగౌడ్‌ ఆరోపించారు. రాంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.

Updated Date - 2020-06-03T10:36:58+05:30 IST