శ్రీవారి క్షేత్రంలో స్పెషల్‌ డ్రైవ్‌

ABN , First Publish Date - 2022-05-24T06:28:26+05:30 IST

శ్రీవారి క్షేత్రంలో స్పెషల్‌ డ్రైవ్‌

శ్రీవారి క్షేత్రంలో స్పెషల్‌ డ్రైవ్‌
కౌన్సెలింగ్‌ ఇస్తున్న ఎస్‌ఐ సుధీర్‌

పిల్లలతో భిక్షాటనపై ఆంధ్రజ్యోతి కథనానికి స్పందన.. పోలీసుల కౌన్సెలింగ్‌
ద్వారకాతిరుమల, మే 23: సమిధలవుతున్న పసిమొగ్గలు శీర్షికన ఆం ధ్రజ్యోతిలో సోమవారం ప్రచురితమైన కథనానికి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు, రాష్ట్రబాలల హక్కుల ఫోరం స్పందించాయి. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ డీసీపీ యూ కె.భార్గవి, మహిళా పోలీసులు లక్ష్మీ సుజన, ఆర్‌. మౌనికారాణి ద్వారకా తిరుమల క్షేత్ర పరిసరాల్లో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పిల్ల లను అంగన్‌ వాడీలో పిల్లలను ఉంచేలా ఏర్పా ట్లు చేశారు. మరోసారి పిల్లలతో భిక్షాటన చేస్తే ఊరుకోబోమని ఎస్‌ఐ టి.సుధీర్‌ హెచ్చరించారు.
సీడబ్ల్యూసీలో కేసు..
కథనంపై స్పందించిన రాష్ట్ర బాలల హక్కు ల ఫోరం సెక్రటరీ జనరల్‌ టీఎన్‌ స్నేహన్‌.. జిల్లా బాలల సంక్షేమ సమితి (సీడబ్ల్యూసీ)లో కేసు దాఖలు చేశారు. భిక్షాటనపై స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించి బాధిత బాలలకు న్యాయం జరపాలని, జిల్లా బాలల రక్షణ విభాగం, జిల్లా ప్రొబేషన్‌ అధికారి విచారణ జరపాలని సీ డబ్ల్యూసీ చైర్‌పర్సన్‌ రెబ్కారాణి ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాది, బాలల హక్కుల కార్యకర్త స్నేహన్‌ ఆంధ్రజ్యో తితో మాట్లాడారు. బాలలతో భిక్షాటన చేయిం చడం నేరమని తెలిపారు. భిక్షాటన జరగకుం డా చూడాల్సిన బాధ్యత అఽధికారులపై ఉందన్నారు.



Updated Date - 2022-05-24T06:28:26+05:30 IST