బెంగళూరు: కర్ణాటకలో భజరంగ్‌దళ్ కార్యకర్త హర్ష హత్యపై విధ్వేష వ్యాఖ్యలు చేసినందుకుగాను ఆ రాష్ట్ర మంత్రి కేఈ ఈశ్వరప్పపై దర్యాప్తు చేయాలని ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఒక వ్యక్తి వేసిన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. హర్షను హత్య చేసింది హిజాబ్‌కు అనుకూలంగా నిరసన చేస్తున్నవారేనంటూ అప్పట్లో మంత్రి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన చెందిన హర్ష (28) అనే భజరంగ్‌దళ్ కార్యకర్త ఫిబ్రవరిలో హత్యకు గురయ్యారు. ఇతడి హత్య రాష్ట్రవ్యాప్తంగా పెద్ద దుమారం లేపింది. శివమొగ్గలో పలు హింసాత్మక నిరసనలకు, ధర్నాలకు దారి తీసింది. అనంతరం, శివమొగ్గలో ప్రభుత్వం నిషేదాజ్ణలు విధించే పరిస్థితి వరకు వెళ్లింది. అయితే హర్ష మరణం అనంతరం నిర్వహించిన సంస్మరణ సభకు మంత్రి ఈశ్వరప్ప హాజరయ్యారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ హర్షను చంపింది ముస్లింలే అని వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి
ఈశ్వరప్ప వ్యాఖ్యలు హిందూ, ముస్లింల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఒక వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. సదరు మంత్రిపై సెక్షన్ 124ఏ (విధ్వేష వ్యాఖ్యలు చేయడం), 153ఏ (రెండు మతాల మధ్య శతృత్వాన్ని పెంచడం), 153బీ, 295ఏ (మతపరమైన భావాలను ఇబ్బంది పెట్టే విధంగా విధ్వేష వ్యాఖ్యలు చేయడం), సెక్షన్ 504 (శాంతిని పాడు చేయాలనే ఉద్దేశంతో విధ్వేష వ్యాఖ్యలు చేయడం) కింద కేసు నమోదు చేశారు. పోలీసు స్టేషన్లో నమోదైన కేసు ఆధారంగా మంత్రిపై విచారణ చేపట్టాలని దొట్టపేట పోలీసులను కోర్టు ఆదేశించింది.
ఇవి కూడా చదవండి