హైదరాబాద్: రాష్ట్రంలో పలు సమస్యల పరిష్కారం కోసం పార్టీ తరపున నిర్వహించే ఉద్యమాలకు ప్రత్యేక కమిటీలు వేయాలని టీ.కాంగ్రెస్ నిర్ణయించింది. ఆ పార్టీ నేతల జూమ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చార్జీల పెంపులపై క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చేయాలన్నారు. ఈ ఉద్యమాలకు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. 111 జీఓ పైన నిపుణులతో అధ్యయన కమిటీ చేయాలని, దాని ఆధారంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రతి ధాన్యం గింజ కొనే వరకు రైతులకు వెన్నంటి ఉండాలన్నారు. దళిత బంధు పథకంలో అర్హులందరికీ లబ్ది జరిగేలా గ్రామ స్థాయిలో పోరాటం చేయాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, వర్కింగ్ ప్రసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, మాజీ కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రేణుక చౌదరి, కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, సీనియర్ ఉపాధ్యక్షులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి