పంకజ్ త్రిపాఠి.. ఈ పేరు తెలుగు వాళ్లకి ఏమో కానీ.. బాలీవుడ్ వాళ్లకి మాత్రం బాగా పరిచయం ఉన్న పేరు. తెలుగులో మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా నటించిన 'దూసుకెళ్తా' చిత్రంలో పంకజ్ త్రిపాఠి విలన్‌గా నటించారు. ప్రస్తుతం ఆయన బాలీవుడ్లో బిజీ నటుడు. అనేక భాషల్లో నటించిన టాలెంటెడ్ నటులలో ఆయన ఒకరు. ప్రస్తుతం పంకజ్ త్రిపాఠి సినిమాలలోనే కాకుండా వెబ్ సిరీస్‌లలోనూ కీలక పాత్రలలో నటిస్తూ.. ప్రేక్షకుల మన్ననలను అందుకుంటున్నారు. ఆయన నటించిన 'మిర్జాపూర్' వెబ్ సిరీస్ ఎంత ఫేమస్ అయిందో తెలియంది కాదు. క్రిమినల్ జస్టీస్ అనే మరో వెబ్ సిరీస్‌లో కూడా ఆయన కీలకపాత్రలో నటించారు. తాజాగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ముచ్చటించారు.
ఈ సమావేశంలో.. ఆయన లాక్డౌన్లో ఎలా గడిపారు? తెలుగు ప్రేక్షకుల ఎందుకు ధన్యవాదాలు తెలిపారు? యాక్టర్ కాకపోయి ఉంటే ఏం అయ్యేవారు? దూసుకెళ్తా సినిమాలో ఎలా అవకాశం వచ్చింది? బ్రహ్మానందాన్ని చూడగానే ఎందుకు నవ్వు వచ్చేది? హైదరాబాద్‌తో ఉన్న అనుబంధం ఏమిటి? తదుపరి చేయబోతోన్న ప్రాజెక్ట్స్ ఏమిటి?.. వంటి ఎన్నో ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అవేంటో తెలియాలంటే.. పై వీడియో చూడాల్సిందే.