ప్లాస్టిక్‌పై ప్రత్యేక తనిఖీ

ABN , First Publish Date - 2022-07-03T04:58:36+05:30 IST

జమ్మలమడుగులో ఒకటో తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉందని హెచ్చరికలు జారీ చేశారు.

ప్లాస్టిక్‌పై ప్రత్యేక తనిఖీ

జమ్మలమడుగు రూరల్‌, జూలై 2: జమ్మలమడుగులో ఒకటో తేదీ నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్లాస్టిక్‌ నిషేధం అమలులో ఉందని హెచ్చరికలు జారీ చేశారు. అందులో భాగంగా శనివారం ఉదయాన్నే పట్టణంలోని అన్ని వ్యాపారుల యజమానులకు తెలియజేశారు. ప్లాస్టిక్‌ వినియోగం వలన అనర్థాలు తెలిపారు. అందులో భాగంగా  శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ నూర్‌బాష, వారి సిబ్బంది ప్లాస్టిక్‌ తనిఖీలను చేపట్టారు. మార్కెట్‌ రోడ్డులో పది కేజీల ప్లాస్టిక్‌ కవర ్లను పట్టుకున్నట్లు వారు తెలిపారు. ప్లాస్టిక్‌ కవర్ల వినియోగదారులపై రూ.5,500 జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు. ఇక ప్రతిరోజు పట్టణంలోని అన్ని దుకాణాలలో తమ సిబ్బంది దాడులు నిర్వహిస్తామన్నారు.  

Updated Date - 2022-07-03T04:58:36+05:30 IST