అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి

ABN , First Publish Date - 2022-07-05T04:28:37+05:30 IST

ప్రజావాణిలో భాగంగా ప్రజలనుంచి వస్తున్న అర్జీలపరిష్కారంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌తో కలిసి సోమ వారం అర్జీదారులనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదారులు మళ్లీ మళ్లీ ఫిర్యాదులతో రాకుండా చూడాలని సూచించారు.

అర్జీల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలి
అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

- కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌

ఆసిఫాబాద్‌, జూలై 4: ప్రజావాణిలో భాగంగా ప్రజలనుంచి వస్తున్న అర్జీలపరిష్కారంలో ప్రత్యేకశ్రద్ధ చూపాలని కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్‌ చాహత్‌బాజ్‌పాయ్‌తో కలిసి సోమ వారం అర్జీదారులనుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫిర్యాదారులు మళ్లీ మళ్లీ ఫిర్యాదులతో రాకుండా చూడాలని సూచించారు. సిర్పూర్‌(యూ) మండలం రాఘాపూర్‌ గ్రామానికి చెందిన కమలాబాయి తాను ఏఎన్‌ఎం చదువుకున్నా నని ఉపాధికోసం నర్సు ఉద్యోగం లేదా ఏదైనా వ్యాపా రం ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన రుణం మంజూరు చేయాలని కోరింది. కాగజ్‌నగర్‌ మండలం ఎల్లాపూర్‌కు చెందిన జ్యోతిక తన భర్త మృతిచెందా డని ఏదైనా హస్టల్‌లో వంటమనిషిగా అవకాశం కల్పించాలని కోరింది. సిర్పూర్‌(యూ) మండలం రాఘాపూర్‌ గ్రామానికి చెందిన సంధ్యారాణి తన రెండు సంవత్సరాల కూతురు జ్యోతిక రెండు కాళ్లు, రెండు చేతులు వంకరగా ఉండి ఇబ్బంది పడు తుందని ఆపరేషన్‌ చేయించడానికి అవసరమైన ఆర్థికసాయం కల్పించాలని, దివ్యాంగుల పెన్షన్‌ వచ్చేలా చూడాలని కోరింది. ఆసిఫాబాద్‌ మండలం సాలెగూడ గ్రామానికి చెందిన అరిగెల మల్లేష్‌ గ్రామ శివారులో సర్వేనం.222లో తనకు తాతాల కాలం నుంచి6.35 ఎకరాల భూమి ఉందని ఆన్‌లైన్‌లో చూపించడం లేదని కోర్టు ఆర్డర్‌ ఆధారంగా చేసుకుని ఆన్‌లైన్‌ చేయాలని కోరాడు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T04:28:37+05:30 IST