Abn logo
Sep 24 2021 @ 23:24PM

విశాఖ-కిరండోల్‌ మధ్య ప్రత్యేక బై వీక్లీ రైలు

విశాఖపట్నం, సెప్టెంబరు 24: ప్రయాణికుల డిమాండ్‌ మేరకు విశాఖ-కిరండోల్‌ మధ్య ప్రత్యేక బై వీక్లీ రైలు ప్రవేశపెడుతున్నట్లు వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. 08514 నంబరు గల ఈ ప్రత్యేక రైలు వచ్చే నెల రెండు నుంచి శని, మంగళవారాల్లో రాత్రి 9.20 గంటలకు విశాఖలో బయలుదేరి మర్నాడు ఉదయం 9 గంటలకు కిరండోల్‌ చేరుతుందన్నారు.


తిరుగు ప్రయాణంలో 08513 నంబరు గల ప్రత్యేక రైలు వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రతీ బుధ, ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు కిరండోల్‌లో బయలుదేరి మర్నాడు ఉదయం తెల్లవారు జామున 2.40 గంటలకు విశాఖ చేరుతుంది. ఈ సర్వీసులలో ఒక సెకండ్‌ ఏసీ, మూడు థర్డ్‌ ఏసీ, నాలుగు స్లీపర్‌, మూడు జనరల్‌ సెకండ్‌ క్లాసు, రెండు సెకండ్‌ క్లాసు కమ్‌ లగేజి కోచ్‌లుంటాయని, కొత్తవలస, అరకు, కోరాపుట్‌, జైపూర్‌, జగదల్‌పూర్‌,దంతేవార మీదుగా రాకపోకలు సాగిస్తుందని తెలిపారు.