ఆంధ్రాకు Special బస్సులు

ABN , First Publish Date - 2022-05-23T16:04:58+05:30 IST

ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఈటీసీ)

ఆంధ్రాకు Special బస్సులు

పెరంబూర్‌, మే 22: ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్ర రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు స్టేట్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (ఎస్‌ఈటీసీ) అధికారులు తెలిపారు. సాధారణంగా నగరం నుంచి ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలు తిరుపతి, శ్రీకాళహస్తి సహా నెల్లూరు తదితర ప్రాంతాలకు ప్రజలు వెళుతుంటారు. రెండేళ్లలో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ అమల్లో ఉండడంతో ప్రజలు నగరానికి పరిమితమయ్యారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుతో నగర ప్రజలు స్వామి దర్శనం, స్వగ్రామాలకు అధికసంఖ్యలో వెళుతున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్థానిక కోయంబేడు నుంచి తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరు తదితర ప్రాంతాలకు అదనంగా 200 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆంధ్ర రాష్ట్రం నుంచి తమిళనాడుకు వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ఆ రాష్ట్ర రవాణా సంస్థ ప్రత్యేక బస్సులు నడుపుతోందని అధికారులు తెలిపారు.

Updated Date - 2022-05-23T16:04:58+05:30 IST