హైదరాబాద్, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): దుబాయ్‌లో జరుగుతున్న ఎక్స్‌పో-2020లో హైదరాబాద్ నుంచి వెళ్లిన స్టార్ట్‌పలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వివిధ దేశాల నుంచి వందల సంఖ్యలో స్టార్ట్‌పలు తమ ఆవిష్కరణలను ప్రదర్శించగా.. మన దేశం నుంచి 500, తెలంగాణ నుంచి 14 స్టార్ట్‌పలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. నగరానికి చెందిన కౌస్తుబ్ స్టార్టప్ జర్స్ సేఫ్టీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ పూర్తిచేసిన ఈయన ప్రపంచంలోనే తొలి ఏసీ హెల్మెట్‌ను అభివృద్ధి చేశారు. కరోనా వైరస్, ఎండ, వాయు కాలుష్యం నుంచి రక్షణ కల్పించే వస్ర్తాన్ని అభివృద్ధి చేసిన దీప్తి నాథల ఆవిష్కరణ ప్రత్యేకంగా నిలిచింది. హీకాల్ పేరుతో ఆమె స్టార్ట్‌పను ప్రారంభించారు. అలాగే.. ఇస్రోలో పనిచేసిన రాకెట్ ఇంజనీర్లు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకాల స్కైరూట్, శ్రీకాంత్ రెడ్డి కలకొండ స్థాపించిన.. ఇంధన ద్విచక్ర వాహనాలను బ్యాటరీ వాహనాలుగా మార్చే హాలా మోబిలిటీ సందర్శకులను ఆకట్టుకొన్నాయి.