విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా.. కారణం ఇదే!

ABN , First Publish Date - 2022-05-01T18:28:51+05:30 IST

పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ప్రత్యేకించి జపాన్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిస

విదేశీ ప్రయాణికులపై ప్రత్యేక నిఘా.. కారణం ఇదే!

బెంగళూరు విమానాశ్రయంలో థర్మల్‌ స్ర్కీనింగ్‌

బెంగళూరు: పలు దేశాల్లో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా పెంచారు. ప్రత్యేకించి జపాన్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్‌ స్ర్కీనింగ్‌ తప్పనిసరి చేశారు. కొవిడ్‌ లక్షణాలు ఉంటే ఎయిర్‌పోర్ట్‌లోనే శాంపిల్స్‌ సేకరించి ఫలితం వచ్చేదాకా వేచి ఉండేలా నిర్ణయించారు. పాజిటివ్‌ నిర్ధారణ అయితే జినోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపిస్తారు. జపాన్‌, థాయ్‌లాండ్‌ నుంచి వచ్చే ప్రయాణికులకు 14 రోజుల పాటు టెలి మానిటరింగ్‌ తప్పనిసరి చేశారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. దక్షిణకొరియా, జపాన్‌, థాయ్‌లాండ్‌, ఆస్ట్రేలియా, వియత్నాం, న్యూజిలాండ్‌ దేశాలలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్నందున అప్రమత్తం చేశారు. బెంగళూరుకు జపాన్‌, థాయ్‌లాండ్‌లనుంచి నేరుగా విమానాలు ఉన్నమేరకు అనుబంధ దేశాల నుంచి కూడా ప్రయాణికులు వచ్చే అవకాశం ఉందని ప్రత్యేక ని ఘా విధించారు.




Updated Date - 2022-05-01T18:28:51+05:30 IST