బడ్జెట్ 2022... ప్రత్యేక యాప్..
ABN , First Publish Date - 2022-01-28T23:56:23+05:30 IST
మరో మూడు రోజుల్లో తెరమీదకు రానున్న కేంద్ర బడ్జెట్‌తో పాటు... బడ్జెట్ వివరాలను వెల్లడించేందుకుగాను ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ కూడా రానుంది.. ఈ సారీ కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్ రూపంలోనే ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ : మరో మూడు రోజుల్లో తెరమీదకు రానున్న కేంద్ర బడ్జెట్‌తో పాటు... బడ్జెట్ వివరాలను వెల్లడించేందుకుగాను ప్రత్యేకంగా ఓ అప్లికేషన్ కూడా రానుంది.. ఈ సారీ కేంద్ర బడ్జెట్‌ను డిజిటల్ రూపంలోనే ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో.... సాధారణ పౌరులు బడ్జెట్ వివరాలను తెలుసుకునేందుకు ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది కేంద్రం. రానున్న ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ పూర్తిగా పేపర్ లెస్‌గా ఉండనుంది. దీనితో బడ్జెట్ అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరికొత్త మొబైల్ యాప్‌ను తీసుకొచ్చింది. వివరాలిలా ఉన్నాయి.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఊరెీన పార్లమెంట్లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. కాగా... పూర్తి స్థాయిలో పేపర్‌లెస్‌గా బడ్జెట్ ప్రవేశపెడుతుండటం ఇది రెండో సారి. గతేడాది కూడా సాఫ్ట్ కాపీ రూపంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి. కరోనా సంక్షోభం ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సభ్యులు(ఎంపీలు), సాధారణ పౌరులు బడ్జెట్ వివరాలను సులంభంగా చదివేందుకు వీలుగా కేంద్రం 'యూనియన్ బడ్జెట్ మొబైల్ యాప్'ను ప్రారంభించింది.
ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు...
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. ఈ మొబైల్ యాప్‌లో బడ్జెట్‌కు సంబంధించిన వివరాలన్నింటిని తెలుసుకోవచ్చు. ఇప్పటికే ప్లే స్టోర్, యాప్ స్టోర్లలో ఈ యాప్ డౌన్లోడ్లకు అందుబాటులో ఉంది.