‘మన ఊరు-మన బడి’కి.. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి

ABN , First Publish Date - 2022-05-13T21:25:14+05:30 IST

పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’ కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రూ.7,290 కోట్లతో చేపట్టిన కార్యక్రమం బాగుందని..

‘మన ఊరు-మన బడి’కి.. బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలి

హైదరాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి): పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన ‘మన ఊరు-మన బడి’( Mana Uru Mana Badi) కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని కోరుతూ సీఎం కేసీఆర్‌(cm kcr)కు ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ (ఎఫ్‌జీజీ) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి లేఖ రాశారు. రూ.7,290 కోట్లతో చేపట్టిన కార్యక్రమం బాగుందని అయితే, మండల, జడ్పీ, ఉపాధి హామీ వంటి 8 పథకాల నుంచి నిధులను మళ్లిస్తున్నారని గుర్తుచేశారు. గత ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో రూ.3,498 కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయారన్నారు. కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో ఏదైనా ఇంజనీరింగ్‌ శాఖ ద్వారా అమలు చేస్తే బాగుంటుదని అభిప్రాయపడ్డారు.

Read more