గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ

ABN , First Publish Date - 2021-11-20T05:33:35+05:30 IST

జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్పీ దీపికా పాటిల్‌ అన్నారు.

గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా: ఎస్పీ
వేపాడ స్టేషన్‌లో రికార్డులు పరిశీలిస్తున్న ఎస్పీ

వేపాడ: జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు ఎస్పీ దీపికా పాటిల్‌ అన్నారు. శుక్రవారం వల్లంపూడి పోలీస్‌ స్టేషన్‌ను ఆమె పరిశీలించి విలేఖర్ల తో మాట్లాడారు. గంజాయి రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసు కుంటున్నామని, ఇటీవల రెండు కేసులు నమోదు చేశామని, ఈ రెండు ఘటనల్లో 20,40 కేజీల్లోపు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దీని నివారణలో భాగంగా మెంటాడ మండలంలోని ఆండ్రలో చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ముందుగా స్టేషన్‌ రికార్డులను పరిశీలించిన ఎస్పీ రికార్డుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎస్‌.కోట సీఐ సింహాద్రినాయుడు పాల్గొన్నారు. అనంతరం సిబ్బంది తో మాట్లాడుతూ వారి కష్ట సుఖాలపై ఆరా తీశారు.  

 లక్కవరపుకోట:  లక్కవరపు కోట పోలీసు స్టేషన్‌ను ఎస్పీ దీపికా పాటిల్‌ శుక్రవారం సాయంత్రం తనిఖీచేశారు. పోలీసుస్టేషన్‌లో రికార్డుల మెంటినెన్స్‌, అధికారుల పనితీరుపై ఆరా తీశారు. స్టేషన్‌ వాతావరణం పరిశీలించారు. క్రైమ్‌ రేటు తగ్గాలని, మాదకద్రవ్యాలు అక్రమ రవాణాపై నిఘా పెంచాలని సీఐ సింహాద్రి నాయుడు, ఎస్‌ఐ లక్ష్మణరావులకు సూచించారు. 



 


Updated Date - 2021-11-20T05:33:35+05:30 IST