పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2021-04-19T04:45:20+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉఽధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించా మని మునిసిపల్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. కేశవ్‌ అన్నారు.

పట్టణ పారిశుధ్యంపై ప్రత్యేక కార్యాచరణ
పట్టణంలోని 14వ వార్డులో ద్రావణాన్ని స్ర్పే చేస్తున్న మునిసిపల్‌ కార్మికులు

- మునిసిపల్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. కేశవ్‌

- ఆయా వార్డుల్లో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌18: కరోనా సెకండ్‌ వేవ్‌ ఉఽధృతి రోజురోజుకు  పెరుగుతున్న నేపథ్యంలో పట్టణంలో పారిశుధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించా మని మునిసిపల్‌ చైర్మన్‌ బీ.ఎస్‌. కేశవ్‌ అన్నారు. పుర పాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు పట్టణం లో ఆదివారం 14, 15వ వార్డు పరిధిలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారి కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. ఈ సందర్భంగా మునిసిపల్‌ చైర్మన్‌ కేశవ్‌ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.   పట్టణ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. అవసరం ఉంటే తప్ప బయటికి రావద్దని సూచిం చారు.  మాస్కులను  తప్పనిసరిగా ధరించి, భౌతిక దూరం పాటిస్తూ దైనందిన కార్యక్ర మాలను నిర్వహించుకోవాలని ప్రజలకు సూచించారు.  ఆయన వెంట శానిటరీ ఇన్స్‌పెక్టర్‌ సునీల్‌, నాయ కులు ఉన్నారు. 

  ఫిట్టర్‌ బెడ్‌ శుభ్రం

పట్టణంలోని దాదాపు పదివార్డుల ప్రజల కు తాగునీటిని అందిస్తున్న  జములమ్మ ఫిల్టర్‌ బెడ్‌ను మునిసిపల్‌ సిబ్బంది ఆదివారం శుభ్రం చేశారు. ఫి ల్టర్‌ బెడ్‌లో పేరుకుపోయిన ఒండ్రుమట్టిని పూర్తిగా తొలగించారు. శుద్ధీకరణ ప్లాంటులో బ్లీచింగ్‌ పౌడర్‌, అల్లం పట్టికలను తగిన మోతాదులో వేసి శుద్ధమైన నీరు ప్రజలకు సరఫరా చేసేలా ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-04-19T04:45:20+05:30 IST