కొవిడ్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ

ABN , First Publish Date - 2021-04-17T05:39:15+05:30 IST

కొవిడ్‌ నియంత్రణపై కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాల్లో ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన వాటిల్లో చికిత్సలు ప్రారంభించాలన్నారు.

కొవిడ్‌ నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ
హాజరైన కలెక్టర్‌, ఎస్పీ, ఇతర అధికారులు





సీఎం జగన్‌ 

కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 16: కొవిడ్‌ నియంత్రణపై కార్యాచరణ రూపొందించాలని  సీఎం జగన్‌ ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాల్లో ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రులుగా గుర్తించిన వాటిల్లో చికిత్సలు ప్రారంభించాలన్నారు. పక్షం రోజుల్లో మిగతా ఆస్పత్రులను సిద్ధం చేయాలన్నారు. 24 గంటలూ సేవలందించేలా హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. కొవిడ్‌ నిర్ధారణ అయిన వారు హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాలని, సదుపాయాలు లేని వారిని కేర్‌ సెంటర్లలో చేర్పించాలన్నారు. బాధితులకు మెరుగైన భోజనం, చికిత్స అందించాలని ఆదేశించారు. రోజూ ఏఎన్‌ఎంలు వెళ్ళి వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవాలన్నారు.   ప్రైమరీ కాంటాక్ట్‌ల వ్యాధి నిర్ధారణకు   ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు.  98 శాతం వ్యాక్సినేషన్‌తో   రాష్ట్రంలోనే విజయనగరం జిల్లా టాప్‌లో నిలవడంపై సీఎం ప్రశంసించారు. 

ప్రత్యేక  టీమ్‌లు  

జిల్లాలోని కొవిడ్‌ నియంత్రణకు ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేయనున్నామని కలెక్టర్‌ హరి జవహర్‌లాల్‌ చెప్పారు. సీఎం వీడియోకాన్ఫరెన్స్‌ అనంతరం జిల్లా అధికారులతో కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కొవిడ్‌ నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించడం ,  కరోనా చికిత్స , ఇళ్లలో ఉన్న వారికి తగిన వైద్య సాయం , ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లలో చికిత్స , సౌకర్యాలు కల్పన తదితర అంశాలపై అధికారులతో టీమ్‌లు ఏర్పాటు చేసే బాధ్యతను  జేసీ మహేష్‌ కుమార్‌కు అప్పగించారు.  ఎస్పీ రాజకుమారి, జేసీ కిషోర్‌ కుమార్‌, డీఎంఅండ్‌హెచ్‌వో రమణ కుమారి తదితరులు ఉన్నారు. 





Updated Date - 2021-04-17T05:39:15+05:30 IST