మూత్రం మాట్లాడితే...

ABN , First Publish Date - 2021-10-19T05:30:00+05:30 IST

మూత్రం మాట్లాడకపోవచ్చు. కానీ దాని రంగు పలురకాల ఆరోగ్య పరిస్థితులను తెలుపుతుంది..

మూత్రం మాట్లాడితే...

మూత్రం మాట్లాడకపోవచ్చు. కానీ దాని రంగు పలురకాల ఆరోగ్య పరిస్థితులను తెలుపుతుంది. కాబట్టి రంగును బట్టి సమస్యను అంచనా వేయగలిగే వీలుంది.

తేలికపాటి పసుపుపచ్చ: సరిపడా నీళ్లు తాగే ఆరోగ్యవంతుల మూత్రం ఈ రంగులోనే ఉంటుంది. కాబట్టి కంగారు పడవలసిన అవసరం లేదు.

ముదురు పసుపుపచ్చ: ఒంట్లో నీళ్లు తగ్గాయని అర్థం. కామెర్లు సోకినా మూత్రం ఇదే రంగులో ఉంటుంది.

ఆకుపచ్చ: నీలం రంగు ఫుడ్‌ కలర్‌ వేసిన పదార్థాలు తినడం మూలంగా ఆకుపచ్చ మూత్రం తయారవుతుంది.

అస్పష్టంగా: మూత్రం పారదర్శకంగా లేకుండా మసకగా కనిపిస్తే, అవసరానికి మించి ప్రొటీన్‌ తింటున్నారని అర్థం. 

తెల్లని మేఘాలు: మూత్రంలో తెల్లని మేఘాల్లాంటి ఆకారాలు కనిపిస్తే, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్‌గా భావించాలి. మూత్రవిసర్జన సమయంలో మంట, తరచుగా మూత్రవిసర్జన చేయవలసి రావడం లాంటి లక్షణాలు కూడా ఉంటే వైద్యులను సంప్రతించాలి.

ముదురు గోధుమ రంగు: కామెర్లు, ఇతరత్రా కాలేయ సమస్యల్లో ఇలా జరుగుతుంది.

ఎరుపు: మూత్రపిండాల్లో రాళ్లు, మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు, కేన్సర్‌ లాంటి అనారోగ్యాల్లో ఈ పరిస్థితి ఉంటుంది.

Updated Date - 2021-10-19T05:30:00+05:30 IST