తెలుగువారి ఆస్తి ఎన్టీఆర్‌

ABN , First Publish Date - 2022-07-14T13:21:23+05:30 IST

సామాన్యుల్లో సైతం రామాయణ, భారత ఇతిహాసాల పట్ల అమితాసక్తిని రేకెత్తించిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు అంటూ డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితిలో వక్తలు కొనియాడారు.

తెలుగువారి ఆస్తి ఎన్టీఆర్‌

డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి సదస్సులో వక్తలు

(అమెరికా నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): సామాన్యుల్లో సైతం రామాయణ, భారత ఇతిహాసాల పట్ల అమితాసక్తిని రేకెత్తించిన విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు అంటూ డెట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితిలో వక్తలు కొనియాడారు. ఎన్టీఆర్‌ శత జయంతి సందర్భంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఆధ్వర్యంలో డెట్రాయిట్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో సాహితీ సదస్సు జరిగింది. కార్యక్రమంలో ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, సహస్రావధాని మేడసాని మోహన్‌, తాళ్లూరి ఆంజనేయులు తదితరులు ప్రసంగించారు. తెలుగు భాషా వికాసానికి ఎన్టీఆర్‌ చేసిన కృషిని సభలోని వక్తలు కొనియాడారు. తెలుగువారి ఆస్తి ఎన్టీఆర్‌ అంటూ అభివర్ణించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, మేడసాని మోహన్‌ గుర్తుచేసుకున్నారు. తెలుగు సంస్కృతి, కళలను భావితరాలకు పరిచయం చేసే లక్ష్యంతో తాము నిర్వహించనున్న ప్రాజెక్టు గురించి డిట్రాయిట్‌ తెలుగు సాహితీ సమితి సభ్యులు పిన్నమనేని శ్రీనివాస్‌, డాక్టర్‌ వేములపల్లి రాఘవేంద్ర చౌదరి వివరించారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌ బండ్ల హనుమయ్య సభాధ్యక్షతలో సాగిన సభలో వంద మందికిపైగా ఎన్టీఆర్‌ అభిమానులు, తెలుగు సాహిత్య ప్రియులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-14T13:21:23+05:30 IST