కోర్టులపై చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్న స్పీకర్ తమ్మినేని

ABN , First Publish Date - 2020-07-04T01:27:54+05:30 IST

కోర్టులపై తాను చేసిన వ్యాఖ్యలను స్పీకర్ తమ్మినేని సీతారం సమర్ధించుకున్నారు. కోర్టులపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని

కోర్టులపై చేసిన వ్యాఖ్యలను సమర్ధించుకున్న స్పీకర్ తమ్మినేని

తిరుపతి: కోర్టులపై తాను చేసిన వ్యాఖ్యలను స్పీకర్ తమ్మినేని సీతారం సమర్ధించుకున్నారు. కోర్టులపై ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, తన అభిప్రాయాన్ని చెప్పానని, ప్రజలు నిర్ణయించుకుంటారని వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంపై స్పీకర్‌ను మీడియా ప్రశ్నించింది. రఘురామ వ్యవహారంపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. 


కోర్టులు అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటుంటే.. ప్రభుత్వమెందుకు.. ప్రజలెందుకు.. ఎన్నికలెందుకు అని సీతారాం వ్యాఖ్యానించి కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘ఈ విధంగా చేయి.. నువ్విక్కడకు వెళ్లు.. ఇది స్టాప్‌ చేయి.. అని చెబుతుంటూ ఇక ప్రజలెందుకు? ఎన్నికలెందుకు? ఓట్లెందుకు... ఎమ్మెల్యేలెందుకు? పార్లమెంటు సిస్టం ఎందుకు? శాసనసభ ఎందుకు? శాసనసభ నాయకుడిని ఎన్నుకునేది ఎందుకు? ముఖ్యమంత్రులు ఎందుకు? స్పీకర్లు ఎందుకు? ఇవన్నీ దేనికి? మీరే (హైకోర్టు) అక్కడి నుంచి రూల్‌ చేస్తారా? న్యాయస్థానాల నుంచి ప్రభుత్వాలను నడిపిస్తారా? భారత రాజ్యాంగం మనకు స్పష్టమైన వ్యవస్థలనిచ్చింది’’ అని తమ్మినేని వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-07-04T01:27:54+05:30 IST