ఎంపీ రఘురామరాజుపై స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-07-05T18:26:56+05:30 IST

నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పందించారు.

ఎంపీ రఘురామరాజుపై స్పీకర్ తమ్మినేని ఆసక్తికర వ్యాఖ్యలు

అమరావతి: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వ్యవహారంపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ స్పందించారు. ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే రఘురామరాజు విమర్శలు చేస్తున్నారన్నారన్నారు. పార్టీ నచ్చకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చన్నారు. రఘురామ రాజు వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌ మారిన విషయం తెలిసిందే. వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన వైనం ఆ పార్టీ అగ్రనేతలకు అస్సలు మింగుడు పడటం లేదు. ఇప్పటికే లోక్‌సభ స్పీకర్‌కు వైసీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. అంతకుముందు పార్టీ తరఫున షోకాజ్ నోటీసు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్పీకర్ తాజా వ్యాఖ్యలు చేశారు.  


ఇక న్యాయ వ్యవస్థపై మరోసారి ఆయన వ్యాఖ్యానించారు. ఒక వ్యవస్థలో మరో వ్యవస్థ జోక్యం సరికాదని వ్యాఖ్యానించారు. సూచనలివ్వాలేగాని.. నిర్ణయాలు తీసుకోవడం సరికాదని కుండబద్ధలు కొట్టారు. ఒక్కరి వల్ల స్థానిక ఎన్నికలు ఆగిపోయాయని నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను ఉద్దేశిస్తూ మాట్లాడారు.

Updated Date - 2020-07-05T18:26:56+05:30 IST