చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ: పోచారం

ABN , First Publish Date - 2021-09-16T00:02:19+05:30 IST

దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో లెజిస్ట్లేచర్ అత్యంత ఉన్నతమైన సభలు. వీటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత చట్టసభలకు ఎన్నికైన సభ్యులతో పాటుగా దేశంలోని ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు.

చట్ట సభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ: పోచారం

హైదరాబాద్: దేశ స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో లెజిస్ట్లేచర్ అత్యంత ఉన్నతమైన సభలు. వీటి గౌరవం కాపాడాల్సిన బాధ్యత చట్టసభలకు ఎన్నికైన సభ్యులతో పాటుగా దేశంలోని ప్రతి ఒక్కరిపైన ఉన్నదని తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. వర్చువల్ విధానం ద్వారా జరిగిన "81వ ఆల్ ఇండియా అసెంబ్లీ స్పీకర్లు, కౌన్సిల్ చైర్మన్ల కాన్ఫరెన్స్" లో హైదరాబాద్ లోని తెలంగాణ అసెంబ్లీ నుండి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న స్పీకర్ పోచారం హిందీ భాషలో ప్రసంగించారు. 1921వ సంవత్సరం సెప్టెంబర్ 15 న జరిగిన ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ జరిగి నేటికి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అందరికి అభినందనలు తెలిపారు. భారతదేశం లోని 28 రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, 3కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ స్పీకర్లు, 6 రాష్ట్రాల శాసనమండలి చైర్మన్లతో పాటుగా పలు కామన్వెల్త్ దేశాల పార్లమెంట్ స్పీకర్లు పాల్గొన్న ఈ కాన్ఫరెన్స్ లో తనకు మాట్లాడే అవకాశం కల్పించిన లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటి చైర్మన్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


రాజ్యసభ, లోక్‌సభ టివీలను కలిపి “సంసద్”టివీ గా మార్చి బుధవారం నుండి ప్రసారాలను ప్రారంభించినందుకు అభినందనలు తెలిపారు.రాష్ట్రాల అసెంబ్లీ, కౌన్సిల్ ల సమావేశాలను కూడా సంసద్ టీవీ ద్వారా ప్రసారం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. దురదృష్టం కొద్ది ఈరోజుల్లో చట్ట సభలలో జరుగుతున్న కొన్ని అసంబద్ద చర్యలను సరిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.అనవసరమైన బయటి రాజకీయాలను సభ్యులు సభలలో ప్రస్తావించరాదు. కేవలం ప్రజా సమస్యలపైన మాత్రమే మాట్లాడే విదంగా అనుమతి ఇవ్వాలని సూచించారు.అదేవిదంగా అనుమతించిన సబ్జెక్టు పైన మాత్రమే సభ్యుడు మాట్లాడాలి, అంతేకాని మరో విషయాన్ని ప్రస్తావిస్తూ దానిపై మాట్లాడకుండా సభ్యులను నియంత్రించాలని అన్నారు. 


బిల్లులపై సభ్యులకు ముందస్తుగానే పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. తద్వారా సభ్యులు తమ అభిప్రాయాలను, ఆలోచనలను పూర్తిగా పంచుకోగలుగుతారు.ఈ మద్య కాలంలో చట్టసభలలో అల్లరి జరగడం, వాయిదాలు వేయడం పరిపాటి అయినది. ఇది జరగకూడదు. పాఠశాల విద్యార్ధుల అల్లరి లాగా చట్టసభలలో సభ్యుల అల్లరి ఉండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. చట్టసభల పవిత్రతను, అత్తున్నన్నత గౌరవాన్ని కాపాడటానికి సరియైన విధానాలను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలోశాసనమండలి ప్రొటెం చైర్మన్ వి. భూపాల్ రెడ్డి, లెజిస్లేటివ్ సెక్రెటరీ డా. వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-16T00:02:19+05:30 IST