రేపు తిరుపతి- సికింద్రాబాదు మధ్య ప్రత్యేక రైలు

ABN , First Publish Date - 2021-01-16T05:22:49+05:30 IST

సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి నుంచి సికింద్రాబాదుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు.

రేపు తిరుపతి- సికింద్రాబాదు మధ్య ప్రత్యేక రైలు

తిరుపతి(ఆటోనగర్‌), జనవరి 15: సంక్రాంతి సెలవులు ముగియడంతో ప్రయాణికుల సౌకర్యార్థం  తిరుపతి నుంచి సికింద్రాబాదుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేష్‌ తెలిపారు. ఈ ప్రత్యేక రైలు (07456) తిరుపతిలో ఆదివారం సాయంత్రం 5గంటలకు బయల్దేరి శ్రీకాళహస్తి, గూడూరు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖాజీపేట మీదుగా మరుసటిరోజు ఉదయం 5.40గంటలకు సికింద్రాబాదుకు చేరుకుంటుంది. టూ, త్రీ ఏసీలతో పాటు స్వీపర్‌క్లాస్‌, సెకండ్‌ సిట్టింగ్‌తో వసతులతో ఈ రైలు నడుస్తుందన్నారు. 

Updated Date - 2021-01-16T05:22:49+05:30 IST