Abn logo
Sep 25 2020 @ 16:11PM

బాలుకి గిన్నీస్‌లో చోటు దక్కిందిలా!

Kaakateeya

సినీ సంగీత ప్రపంచంలో ఆయనది చిరస్మరణీయమైన స్థానం. బాలు గానంలో ఓలలాడని వాళ్లు లేరు. ప్రియురాలిని అల్లరి పెట్టే పాటైనా, చైతన్యం రగిలించే పాటైనా.. ఉద్వేగాన్ని పండించడంలో, ఉత్సాహాన్ని ఇవ్వడంలో ఆయనకు ఆయనే సాటి. ఎన్టీఆర్.. ఏఎన్నార్.. చిరంజీవి ఇలా అందరిని తన గొంతులో ఇట్టే దింపేసేవారు. ఆయన సృష్టించిన రికార్డులకు కొదవలేదు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. కన్నడ సినీ సంగీత దర్శకుడు ఉపేంద్ర కుమార్ స్వరకల్పనలో 12 గంటల్లో 21 పాటలు పాడి గిన్నీస్ రికార్డును సొంతం చేసుకున్నారు. అంతేకాదు పలు భాషల్లో పాడిన ఆయన.. రోజుకు 16-17 పాటలు పాడిన సందర్భాలు ఉన్నాయి. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ... 17 గంటలు నిర్విరామంగా పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి.    

Advertisement
Advertisement
Advertisement