‘వాళ్లు ఒప్పుకుంటే ఎస్పీబీ బయోపిక్’

హైదరాబాద్: సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం కుటుంబం అంగీకరిస్తే ఆయన జీవితం ఆధారంగా సినిమా తీస్తానని శుభోదయం గ్రూపు చైర్మన్ శ్రీలక్ష్మీ ప్రసాద్ ప్రకటించారు. శనివారం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నివాళిగా 60 మంది గాయకులతో ప్రముఖ సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన ‘హృదయాంజలి’ కార్యక్రమంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో 60 మంది గాయకులు బాలుకు నివాళిగా పాటలు పాడటం చాలా ప్రత్యేకంమని లక్ష్మీ ప్రసాద్ పేర్కొన్నారు. ఎస్పీబీకి హృదయాంతరాళాల నుంచి అంజలి ఘటించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి హృదయాంజలి అనే పేరు పెట్టినట్లు ఆయన అన్నారు. బాలు ఎక్కడున్నా ఈ కార్యక్రమం చూసి పులకరించి ఉంటారని, ఆయనను చేరే మార్గం పాట ఒక్కటేనని లక్ష్మీ ప్రసాద్ అన్నారు.

ఫొటోల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

Advertisement