ఉక్రెయిన్‌కు ఆయుధాల బహుమతి పంపిన స్పెయిన్ రాణి

ABN , First Publish Date - 2022-05-02T08:50:32+05:30 IST

రష్యాతో యుద్ధం కారణంగా ఆయుధాలు కొరతతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ దేశానికి పాశ్చాత్య దేశాలు ఆయుధ సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో అమెరికా కొంత వరకు సహాయం చేయగా.. తాజాగా స్పెయిన్ రాణి తమ ఆయుధ భాండాగారం నుంచి కొన్ని గ్రెనేడ్ లాంచర్లు

ఉక్రెయిన్‌కు ఆయుధాల బహుమతి పంపిన స్పెయిన్ రాణి

రష్యాతో యుద్ధం కారణంగా ఆయుధాలు కొరతతో విలవిల్లాడుతున్న ఉక్రెయిన్ దేశానికి పాశ్చాత్య దేశాలు ఆయుధ సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయంలో అమెరికా కొంత వరకు సహాయం చేయగా.. తాజాగా స్పెయిన్ రాణి తమ ఆయుధ భాండాగారం నుంచి కొన్ని  గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలను ఉక్రెయిన్‌కు బహుమతిగా పంపింది.


రష్యా యుద్ధంతో ఉక్రెయిన్‌కు ఆయుధాలు అమ్ముకుంటూ అమెరికా సహా పలు యూరప్ దేశాలు సొమ్ము చేసుకుంటున్నాయి కూడా. రష్యాతో పోల్చితే ఆయుధ సంపత్తిలో ఉక్రెయిన్ చాలా వెనుకబడిన దేశమే. అందుకే ఈ దేశాలు ఉక్రెయిన్‌కు యుద్ధం ప్రారంభం కాకముందు నుంచే ఆయుధాలను తరలిస్తున్నాయి. అయితే, స్పెయిన్ రాణి తీసుకున్న నిర్ణయం మాత్రం సంచలనం కలిగించింది. ఆమె గిఫ్ట్‌గా ఆయుధాలు పంపించడం చర్చనీయాంశంగా మారింది. 


ఉక్రెయిన్ యుద్ధ సామర్థ్యాన్ని పెంచడానికి స్పెయిన్ క్వీన్ ఏకంగా గ్రెనేడ్లు, గ్రెనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలను భారీ మొత్తంలో ఆ దేశానికి షిప్‌మెంట్ చేసింది. తాజాగా, స్పెయిన్ నుంచి వచ్చిన ఆయుధాల షిప్‌మెంట్‌ను ఉక్రెయిన్ స్వీకరించిందని వైస్‌గ్రాడ్ అనే మీడియా సంస్థ ట్విట్టర్‌లో వెల్లడించింది. ఆ షిప్‌మెంట్‌లో స్పెయిన్ రాణి స్వదస్తూరితో రాసిన ఐ విష్ యూ విక్టరీ అనే సందేశం కూడా ఉంది. విత్ లవ్ లెటీషియా అనే లైన్ కూడా ఆ పోస్టు కార్డుపై రాశారు. 


ఉక్రెయిన్‌కు ఆయుధ సరఫరా మార్గాలను ధ్వంసం చేసే ఎత్తును రష్యా బలగాలు వేశాయి. ఇందులో భాగంగా రైల్వేకు ఇంధనం సమకూర్చే ఆరు ఫెసిలిటీలను పేల్చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ గత సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అంతేకాదు, ఇతర దేశాల నుంచి ఉక్రెయిన్‌ ఆయుధాలను దిగుమతి చేసుకోకుండా రైల్వే నెట్‌వర్క్ మొత్తాన్ని నాశనం చేయాలని రష్యా భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పెయిన్ క్వీన్ గిఫ్ట్‌గా వెపన్స్ షిప్‌మెంట్ పంపడం ఉక్రెయిన్‌కు ఎంతో కలిసి వచ్చింది.


Updated Date - 2022-05-02T08:50:32+05:30 IST