‘టోక్యో’లో ఆడతానో లేదో!

ABN , First Publish Date - 2021-05-12T10:46:12+05:30 IST

కరోనా విజృంభణ కారణంగా విశ్వక్రీడలను నిర్వహించొద్దంటూ జపాన్‌లో ఇప్పటికే నిరసనలు మిన్నంటుతున్నాయి.

‘టోక్యో’లో ఆడతానో లేదో!

రోమ్‌: కరోనా విజృంభణ కారణంగా విశ్వక్రీడలను నిర్వహించొద్దంటూ జపాన్‌లో ఇప్పటికే నిరసనలు మిన్నంటుతున్నాయి. ఆతిథ్య దేశవాసుల వ్యతిరేకతతో ఇప్పటికే తలపట్టుకున్న నిర్వాహకులను ఇప్పుడు స్టార్‌ క్రీడాకారుల నుంచి అదే స్వరం వినిపిస్తుండడం మరింత ఆందోళన పరుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో టోక్యో క్రీడల్లో ఆడాలా వద్దా అన్న విషయంపై ఎటూ తేల్చుకోలేకపోతున్నామంటూ టెన్నిస్‌ స్టార్లు సెరెనా విలియమ్స్‌, నవోమి ఒసాక ఇప్పటికే స్పష్టం చేయగా.. తాజాగా స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ కూడా అదే మాట చెప్పాడు.


టోక్యోలో ఆడడంపై తాను హామీ ఇవ్వలేననన్నాడు. ‘ఒలింపిక్స్‌కు నేనెప్పుడూ ప్రాధాన్యమిస్తా. అయితే, అందరికీ ఆమోదయోగ్యమైన ప్రపంచంలో క్రీడలు జరగాలని కోరుకుంటా. కానీ, ఇప్పుడు అన్నీ మారిపోయాయి. ఏడాదిన్నరగా కఠినమైన పరిస్థితులను చూస్తున్నాం. ఈ స్థితిలో నేను మెగా ఈవెంట్‌లో ఆడాలన్న నిర్ణయాన్ని వెంటనే తీసుకోలేను’ అని ప్రపంచ మూడో ర్యాంకర్‌ నడాల్‌ అన్నాడు.

Updated Date - 2021-05-12T10:46:12+05:30 IST