‘స్పందన’కు వినతుల వెల్లువ

ABN , First Publish Date - 2021-10-19T06:09:08+05:30 IST

ఇక్కడి ఆర్డీవో కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్య క్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పలువురు విచ్చేసి వినతి పత్రాలు సమర్పించారు.

‘స్పందన’కు వినతుల వెల్లువ
అర్జీదారుల సమస్యలు తెలుసుకుంటున్న ఆర్డీవో గోవిందరావు

 నర్సీపట్నం, అక్టోబరు 18 : ఇక్కడి ఆర్డీవో కార్యాలయంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్య క్రమానికి వివిధ ప్రాంతాల నుంచి పలువురు విచ్చేసి వినతి పత్రాలు సమర్పించారు. ఆర్డీవో గోవిందరావు అందరితో మాట్లాడి సమస్యలను తెలు సుకున్నారు. పెదబొడ్డేపల్లి బ్రిడ్జి వద్ద గెడ్డలో మునిసిపాలిటీకి సంబంధించిన చెత్తను డంపింగ్‌ చేస్తున్నారని ప్రశాంతినగర్‌ కాలనీకి చెందిన పలువురు ఆరోపించారు. దీని వల్లభరించలేని దుర్వాసన వెదజల్లుతోందని చెప్పారు.  నర్సీపట్నం ప్రాంతానికి చెందిన కొరిబిల్లి నాగేశ్వరరావు, మాకవరపాలెం మండలం బయ్యవరానికి చెందిన సూరిశెట్టి అప్పారావు సదరం సర్టిఫికెట్ల కోసం విన్నవించారు.  ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఏడాది నుంచి సర్టిఫికెట్లు రాలేదని వాపోయారు.  తాను ఒంటరి మహిళనని, అగ్రిగోల్డ్‌లో డబ్బులు కట్టి మోసపోయానని తన డబ్బులు ఇప్పించాలని నర్సీపట్నానికి చెందిన తమరాన లక్ష్మి వేడుకుంది. నాతవరం మండలం ఎంబీ పట్నానికి చెందిన  ఎ.లక్ష్మి తమ ఫ్లాట్‌ ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. మాకవరపాలెం మండలం బూరుగుపాలేనికి చెందిన రుత్తల నూకరాజు తన భూమి సర్వే నంబరు 82/32ను 22 ఏలో చేర్చారని, దానిని తొలగించాలని కోరారు. నర్సీపట్నం మండలం అమలాపురానికి చెందిన ఆర్‌. జగ్గారావు తన భూమి సర్వే 340/12 1-బి సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. 

Updated Date - 2021-10-19T06:09:08+05:30 IST