స్పందనకు అర్జీల వెల్లువ

ABN , First Publish Date - 2021-10-18T05:30:00+05:30 IST

స్పందనకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో సోమవారం ఆయన జేసీలు లక్ష్మీశ, కీర్తి చేకూరి, డీఆర్వో సత్తిబాబుతో కలిసి అర్జీలు స్వీకరించారు.

స్పందనకు అర్జీల వెల్లువ
సమస్య తెలుసుకుంటున్న కలెక్టర్‌

భానుగుడి, అక్టోబరు 18: స్పందనకు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ సి.హరికిరణ్‌ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని స్పందన హాల్లో సోమవారం ఆయన జేసీలు లక్ష్మీశ, కీర్తి చేకూరి, డీఆర్వో సత్తిబాబుతో కలిసి అర్జీలు స్వీకరించారు. స్పందన కార్యక్రమానికి మొత్తం 397 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రాధాన్య క్రమంలో అర్జీలన్నింటినీ పరిష్కరించాలని సూచించారు. అదే విధంగా జిల్లాలోని వివిధ శాఖల పరిధిలో ఉన్న కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కరించే విధంగా చూడాలని ఆదేశించారు. ప్రతి వారం మండల స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌కు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 25 సోమవారం ఉదయం స్పందన కార్యక్రమంతో పాటు మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఎస్సీ, ఎస్టీ ప్రజల కోసం నిర్వహించే గ్రీవెన్స్‌ కార్యక్రమానికి అధికారులు సిద్ధం కావాలన్నారు.



Updated Date - 2021-10-18T05:30:00+05:30 IST