స్పందనకు 283 ఫిర్యాదులు

ABN , First Publish Date - 2021-10-26T05:45:01+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సోమవారం 283 ఫిర్యాదులు అందాయి.

స్పందనకు 283 ఫిర్యాదులు
అర్జీలను స్వీకరిస్తున్న జేసీలు

గుంటూరు(తూర్పు), అక్టోబరు 25: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో సోమవారం 283 ఫిర్యాదులు అందాయి.  కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ అందుబాటులో లేకపోవడంతో అర్జీలను జేసీలు స్వీకరించారు.  

డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 10 ఫిర్యాదులు

స్పందనకు ముందు ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు నిర్వహించే డయల్‌ యువర్‌ కలెక్టర్‌కు 10 ఫిర్యాదుల అందాయి. ఫిర్యాదులను జేసి దినేష్‌కుమార్‌ స్వీకరించారు. 

30న సమాచారహక్కు వారోత్సవాలు

ఈ నెల 30న సమాచార హక్కు చట్టం వారోత్సవాలను అన్ని ప్రభుత్వ కార్యలయాల్లో నిర్వహించాలని జేసీ దినేష్‌కుమార్‌  అధికారులను ఆదేశించారు. సమాచార హక్కు చట్టం 16 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా  ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. జేసీ రాజకుమారి మాట్లాడుతూ జిల్లాలో ప్రొబేషన కాలంలో విధులు పూర్తిచేసుకున్న సచివాలయ ఉద్యోగులు డిక్లరేషన తీసుకుని రికార్డుల ప్రకారం నివేదిక తయారుచేసి సంబంధిత శాఖల అధికారులకు పంపాలన్నారు. కారుణ్య నియామకాలకు సంబంఽధించి ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ఆయా శాఖల అధికారులు కలెక్టర్‌ కార్యాలయానికి అందజేయాలన్నారు. కార్యక్రమంలో జేసీలు శ్రీధర్‌రెడ్డి, అనుమప అంజలి, డీఆర్వో కొండయ్య తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T05:45:01+05:30 IST