స్పందన అంతంతే!

ABN , First Publish Date - 2022-08-09T06:21:19+05:30 IST

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పం దనకు సమస్యల పరిష్కారం కోసం బాధితుల నుంచి అర్జీలు వెల్లువెత్తు తున్నాయి.

స్పందన అంతంతే!
పల్నాడు జిల్లా నరసరావుపేట కలెక్టరేట్‌లో క్యూలో ఉన్న ఆర్జీదారులు

వెల్లువెత్తుతున్న అర్జీలు

పరిష్కారం కోసం ఎదురుచూపులు 

అత్యధికంగా సివిల్‌ వివాదాలే.. 

మండల స్థాయి అధికారుల నిర్లక్ష్యం 

గత వారం ఐదుగురు తహసీల్దార్‌లకు షోకాజ్‌ నోటీసులు

అయినా మార్పు లేదు..


నరసరావుపేట, ఆగస్టు 8: పల్నాడు జిల్లా కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న స్పం దనకు సమస్యల పరిష్కారం కోసం బాధితుల నుంచి అర్జీలు వెల్లువెత్తు తున్నాయి. కొత్తగా జిల్లా ఏర్పడిన అనంతరం ఏప్రిల్‌ రెండోవారం నుంచి స్పందన నిర్వహిస్తున్నా రు. కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న స్పందనకు గత సోమవారం వరకు 5,471 అర్టీలు అందా యి. వీటిలో 4,588 అర్జీలు పరిష్కారమయ్యాయి. ఇంకా 674 అర్టీలు పెం డింగ్‌లో ఉన్నాయి. ఈ వారం వివిధ సమ స్యలపై 150 అర్జీలు అందాయి. కొందరు అర్జీదారులు సమస్యల పరిష్కారం కోసం స్పందనకు వస్తూనే ఉన్నారు. అచ్చంపేట మండలం నిడుం జర్ల గామానికి చెందిన మదాజు పెద వెంకటేశ్వర్లు కుటుంబం 70 ఏళ్ళుగా ప్రభుత్వం భూమిని సాగు చేసుకుంటోంది. ఆయనకు నలుగురు కుమారు లు ఉన్నారు. వారు సాగు చేసుకుంటున్న 22 ఎకరాల భూమికి సంబంధించి ఒక్కొ క్కరికి మూడు ఎకరాల చొప్పున పట్టా ఇవ్వాలని స్పందనలో  అర్జీ ఇచ్చారు. గత మూడు వారాలుగా ఈ సమస్యను పరిష్కారిం చాలని కోరుతూ స్పంద నకు వస్తున్నారు. తాము ఇచ్చిన అర్జీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వెంకటేశ్వ ర్లు తెలిపారు. స్పందన అర్జీలను పరిష్కరించ డంలో మండల స్ధాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమ వుతున్నాయి. ఈ నేప థ్యంలోనే కలెక్టర్‌ శివ శంకర్‌ లోతేటి గత వారం ఐదుగురు తహసీల్దార్‌లకు షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేశారు. స్పందనకు రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలు, భూ వివాదాల అర్జీలే అఽధికంగా ఉంటున్నాయి.  జిల్లా పోలీసు కార్యాలయం లో ఎస్పీ రవిశంకర్‌ రెడ్డి ప్రతి వారం స్పందనలో అర్జీలను స్వీకరిస్తున్నారు. గత సోమవారం వరకు 1,154 అర్జీలు ఎస్పీకి అందాయి. వీటిలో 911 అర్జీలను పరిష్కరించారు. ఇంకా 243 అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. ఈ వారం మరో 58 అర్జీలను బాధితు లు అందజేశారు. అత్యధికంగా సివిల్‌ వివాదాలకు సంబంధించిన అర్జీలు స్పందనలో అందజేస్తున్నారు.  

 

నా పొలం కబ్జాకు గురైంది..

 రెండేళ్లుగా నా పొలానికి సంబంధించిన సమస్యను పరిష్కరించమని అధికారుల చుట్టూ  తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావటం లేదు. నా పొలం కబ్జాకు గురైంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు  కూడా ఫిర్యాదు చేశా. అయినా పరిష్కారం దొరకలేదు.

 - ఎ.శ్రీనివాసరావు, సత్తెనపల్లి  

   

రెండేళ్లుగా తిరుగుతున్నా..

 20 ఏళ్ల క్రితం వినుకొండ పట్టణంలోని విష్ణుకుండినగర్‌ కాలువ కట్ట సమీపంలో నేను, మా అక్క కలిసి ఇంటి స్థలం కొనుగోలు చేశాం. స్థలాన్ని కాజేసేందుకు స్వయాన కుటుంబసభ్యులే మాపై దాడికి ప్రయత్నిస్తున్నారు. వినుకొండ పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా  పట్టించుకోవడం లేదు. సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాక కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది.  

- ముక్కు సుశీల, సత్యనారాయణపురం, ఈపూరు మండలం 

 

ముగ్గురే.. ముగ్గురు 

సమస్యల పరిష్కా రానికి ప్రతి సోమవారం తహ సీల్దారు కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమానికి అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉంది.  మరికొన్ని చోట్ల అధికారులు మొక్కుబడిగా హాజరై కాసేపలా ఉండి వెళ్లి పోతున్నారు. గురజాల నియో జకవర్గంలో నాలుగు మండలాల్లో సోమ వారం నిర్వహిం చిన ఈ స్పందన కార్యక్ర మానికి అర్జీలేవీ రాలేదు. పిడుగురాళ్లలో తహసీల్దారు కేఎస్‌ చక్రవర్తి, మరో ఇద్దరు ఐసీడీఎస్‌ సూపర్‌ వైజర్లు హాజరుకాగా గురజాలలోనూ అదే పరిస్థితి. తహసీ ల్దారు, మున్సిపల్‌ కమిషనర్‌ ఈఓపీఆర్డీ మాత్రమే హాజరయ్యారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత మరో ముగ్గురు మం డల స్థాయి అధికారులు హాజరయ్యారు. మాచవరం, దాచేపల్లి మండలాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 

 

Updated Date - 2022-08-09T06:21:19+05:30 IST