ఇస్రో రికార్డు బద్దలు కొట్టిన ఫ్రపంచ కుబేరుడు.. ఒకేసారి..

ABN , First Publish Date - 2021-01-25T08:31:55+05:30 IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రికార్డును ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బద్దలు కొట్టాడు. ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ.. ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇస్రో పేరిటే ఉండేది.

ఇస్రో రికార్డు బద్దలు కొట్టిన ఫ్రపంచ కుబేరుడు.. ఒకేసారి..

కాలిఫోర్నియా: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రికార్డును ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ బద్దలు కొట్టాడు. ఆయనకు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ.. ఒకేసారి 143 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇంతకు ముందు ఈ రికార్డు ఇస్రో పేరిటే ఉండేది. 2917లో పీఎస్ఎల్‌వీ రాకెట్ సాయంతో భారత్.. 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇన్ని శాటిలైట్లను ఒకేసారి పంపడం చరిత్రలో ఇదే తొలిసారి.


అయితే ఈ రికార్డును ఇప్పుడు స్పేస్ ఎక్స్ బద్దలు కొట్టింది. ఈ సంస్థ ప్రయోగించిన ట్రాన్స్‌పోర్టర్-1 రాకెట్లో.. 133 ప్రభుత్వ, ప్రైవేటు ఉపగ్రహాలు ఉన్నాయి. వీటితోపాటు మరో 10 స్టార్ లింక్ శాటిలైట్స్ ఉన్నాయి. అంటే మొత్తమ్మీద స్పేస్ఎక్స్ రాకెట్ 143 ఉపగ్రహాలను ఒకేసారి అంతరిక్షంలో ప్రవేశపెట్టింది. స్మాల్‌శాట్ రైడ్‌షేర్ ప్రోగ్రామ్ మిషన్‌లో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించినట్లు స్పేస్ఎక్స్ అధికారులు తెలిపారు.

Updated Date - 2021-01-25T08:31:55+05:30 IST