మరికొన్న దేశాల్లోనూ ‘స్పేస్ ఎక్స్’ ?

ABN , First Publish Date - 2021-10-26T22:26:07+05:30 IST

స్ ఎక్స్‌... 2002 లో ప్రారంభమైన ఈ సంస్థ విలువ మూడు వేల కోట్ల డాలర్లు మాత్రమే. అంటే స్పేస్‌ ఎక్స్‌ కన్నా టెస్లా 30 రెట్లు అధికమన్నమాట.

మరికొన్న దేశాల్లోనూ ‘స్పేస్ ఎక్స్’ ?

వాషింగ్టన్ డీసీ : స్పేస్ ఎక్స్‌... 2002 లో ప్రారంభమైన ఈ సంస్థ  విలువ మూడు వేల కోట్ల డాలర్లు మాత్రమే. అంటే స్పేస్‌ ఎక్స్‌ కన్నా టెస్లా 30 రెట్లు అధికమన్నమాట. కాగా... ఇక ముందు మాత్రం స్పేస్‌ ఎక్స్‌ నుంచి ఎలాన్‌ మస్క్‌కు భారీ ఆదాయం వస్తుందని, కంపెనీ వ్యాల్యూయేషన్‌ భారీగా పెరగనుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం...  స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలన్ మస్క్ 242 బిలియన్ డాలర్ల నికర విలువను కలిగి ఉన్నాడని అంచనా.


కాగా... మస్క్ సంపద... రానున్న దశాబ్ద కాలంలో అనూహ్యంగా పెరిగిపోతుందని మోర్గాన్ చెబుతోంది. ఇదిలా ఉంటే... జర్మనీ, ఆస్ట్రేలియా, భారత్ సహా దుబాయ్ తదితర దేశాల్లో స్పేస్ ఎక్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేయాలని ఎలాన్ మస్క్ యోచిస్తున్నట్లు వినవస్తోంది. అంతేకాకుండా... అంతరిక్షయానానికయ్యే వ్యయాన్ని సాధ్యమైనంతమేరకు తగ్గించేందుకుగానూ వివిధ అంశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. 

Updated Date - 2021-10-26T22:26:07+05:30 IST