ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ

ABN , First Publish Date - 2022-01-25T05:53:01+05:30 IST

జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ ప్రజావాణిలో భాగంగా సోమవారం సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ
అర్జీలను స్వీకరిస్తున్న ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌

నిర్మల్‌ కల్చరల్‌, జనవరి 24 : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ప్రవీణ్‌ కుమార్‌ ప్రజావాణిలో భాగంగా సోమవారం సమస్యలతో వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సమస్యలపై స్పందించి సంబంధిత పోలీస్‌ అధి కారులతో ఫోన్‌లో మాట్లాడారు. తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్ర జలతో స్నేహంగా వ్యవహరిస్తూ పోలీస్‌వ్యవస్థపై నమ్మకం కలిగే విధంగా పని చేయాలన్నారు. శాంతిభద్రతల పరిష్కారంలో ప్రజలు పోలీసులకు సహ కరించాలని అన్నారు. సంఘ విద్రోహ కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పోలీస్‌ అధికారులకు తెలియజేయాలన్నారు. ప్రజల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబర్‌ 8333986939 ఉపయోగించుకోవాలని సూచించారు. 

Updated Date - 2022-01-25T05:53:01+05:30 IST