క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

ABN , First Publish Date - 2020-03-29T11:41:18+05:30 IST

కరోనా వ్యాధి నివారణలో భాగంగా టెక్కలిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి శనివారం పరిశీలించారు.

క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ

టెక్కలి, మార్చి 28:  కరోనా వ్యాధి నివారణలో భాగంగా టెక్కలిలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాన్ని ఎస్పీ ఆర్‌ఎన్‌ అమ్మిరెడ్డి శనివారం పరిశీలించారు. అక్క డ తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. ఆయనతో పాటు పోలీసు అధికా రులు, సిబ్బంది ఉన్నారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే కేసుల నమోదు: ఏఎస్పీ

కరోనా మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నట్లు ఏఎస్పీ పి.సోమశేఖర్‌ తెలిపారు. శనివారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ను, టెక్కలిలో నిర్వహి స్తున్న క్వారంటైన్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లా డారు. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 523 వాహనాలను సీజ్‌ చేశామ న్నారు. నిబంధనలు పాటించని 31 షాపులు, మరో 17 వాహనాలపై కేసులు నమో దు చేసినట్లు చెప్పారు. శనివారం ఒక్కరోజే 23 కేసులతో పాటు 14 వాహనాలు సీజ్‌ చేసినట్లు చెప్పారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉందని, అలాగే తీర ప్రాంతాల్లో సైతం పడవల ద్వారా వారి స్వస్థలాలకు పలవురు వస్తు న్నారని తెలిసి నిఘా ఉంచామన్నారు. సాయంత్రం 6 నుంచి తెల్లవారు జామున 6 గంటల వరకు పోలీస్‌ సిబ్బంది తిరుగుతున్నారన్నారు.


అత్యవసర సిబ్బంది సైతం ఐడీ కార్డులు చూపించి విధులకు వెళ్లాలన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారు ఇంటికి 50 మీటర్లు దాటి బయటకు వస్తే పోలీస్‌ యాప్‌లో జియో ట్యాగింగ్‌ ద్వారా గుర్తించేలా చర్యలు చేప ట్టామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో 450 మందికి ఈ యాప్‌లు వినియోగిస్తు న్నారన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్‌ విభాగాలు కరోనా నివారణ బందోబస్తులో ఉన్నా యన్నారు. లాక్‌డౌన్‌కు ప్రజలు సహకరించాలన్నారు. సమావేశంలో సీఐ నీలయ్య, ఎస్‌ఐ గణేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-29T11:41:18+05:30 IST